TG: సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో ఇకపై రాష్ట్రంలో ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రభావం రాబోయే మూవీలపై పడనుంది. ప్రస్తుతం థియేటర్లలో మూవీలు ఎక్కువగా ఆడటం లేనందున తాజా నిర్ణయంతో భారీ బడ్జెట్ సినిమాలకు నష్టం తప్పదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, సంక్రాంతికి గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ మూవీలు రాబోతున్నాయి.