ప్రముఖ మల్టీఫ్లెక్స్ PVR Inox తన ఆడియెన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. థియేటర్లో మూవీ నుంచి మధ్యలోనే వెళ్లిపోతే డబ్బును రిఫండ్ చేయనుంది. కానీ, మొత్తం అమౌంట్ కాకుండా సినిమా చూసిన టైం వరకు ఛార్జ్ చేసి మిగతాది ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే.. దీనికి టికెట్ ధరపై 10 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్లాన్ ఢిల్లీలో అమలు చేయనున్నారు. అక్కడ సక్సెస్ అయితే మిగత నగరాలకు విస్తరించనున్నారు.