AP: వ్యూహం మూవీకి లీగల్ నోటీసు ఇచ్చినట్లు ఫైబర్‌గ్రిడ్ ఛైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. రూ.2.15 కోట్ల ఒప్పందం చేసుకుని రూ.1.15 కోట్ల చెల్లింపులపై నోటీసులు ఇచ్చామని, వ్యూస్ ప్రకారం డబ్బు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నామన్నారు. కానీ, 1,863 వ్యూస్ మాత్రమే ఉన్నాయని, ఈ లెక్కన ఒక వ్యూకు రూ.11 వేల చొప్పున చెల్లించారని తెలిపారు. దీనిపై వివరణ కోరుతూ లీగల్ నోటీస్ ఇచ్చినట్లు వెల్లడించారు.