అనన్య నాగళ్ల, యువ చంద్ర కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన రూరల్ యాక్షన్ డ్రామా పొట్టేల్. ఈ ఏడాది అక్టోబర్ 25న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. అయితే ఈ చిత్రం ఇవాళ OTTలో ఎంట్రీ ఇచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ రోజు నుంచే పొట్టేల్ మూవీ ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్‌లోనూ అందుబాటులోకి వచ్చేసింది.