సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ‘గుంటూరు కారం’ మూవీ జనవరిలో రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా నార్త్ ఆడియెన్స్‌ను అలరించేందుకు మరోసారి సిద్ధమైనట్లు తెలుస్తోంది. హిందీలో తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్న సర్టిఫికెట్ వైరల్‌గా మారింది. అక్కడ 2:27 గంటల రన్ టైంతో ఈ సినిమా రీ రిలీజ్ కానున్నట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.