టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబుకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. మంచు ఫ్యామిలీ గొడవల నేపథ్యంలో తనపై, తన కుటుంబంపై నెగిటివ్ ప్రచారాలతోపాటు కించపరుస్తూ పలు వెబ్సైట్లు కథనాలు ప్రచురించాయని.. తన ఫొటోలు, వాయిస్‌ను గూగుల్, సోషల్ మీడియాలో వాడొద్దని పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా ఢిల్లీ హైకోర్టు మోహన్ బాబు కంటెంట్‌ను గూగుల్ నుంచి తొలగించాలని తీర్పునిచ్చింది.