యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబో తెరకెక్కిన ‘దేవర’ మూవీ విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ సునామీలా దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే నార్త్ అమెరికాలో ఈ మూవీ ప్రీమియర్స్ 2 మిలియన్ డాలర్ మార్క్ దాటింది. విడుదలకు మూడు రోజులు ముందే అక్కడి బాక్సాఫీస్‌పై తారక్ దండయాత్ర మొదలైంది. ఫస్ట్ వీకెండ్లోనే 5M డాలర్లు రాబట్టే అవకాశం ఉంది. కాగా ఒకరోజు ముందే ఈనెల 26న ప్రీమియర్ షోస్ పడనున్నాయి.