ఇన్‌స్టాలో మంచు లక్ష్మి, జగపతిబాబుల మధ్య ఫన్నీ చర్చ జరిగింది. తాజాగా తన మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గురించి జగపతిబాబు ఓ వీడియో షేర్ చేశారు. ఇందులో బెండకాయ జ్యూస్, పెరుగు అన్నం ఇలా తన బ్రేక్ ఫాస్ట్ గురించి తెలిపారు. ఇది చూసిన లక్ష్మి.. బెండకాయ జ్యూస్ ఎందుకు? అని కామెంట్ పెట్టారు. దానికి ఆయన.. ‘లచ్చిమి.. బెండకాయ రసం కొలెస్ట్రాల్‌కి చాలా మంచిది. నాకు, నీకు కొవ్వు ఎక్కువ కాబట్టి మనకి చాలా అవసరం’ అని బదులిచ్చారు.