స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను ఐకాన్ స్టార్‌గా మార్చిన ‘పుష్ప’ మూవీ సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. అందుకే సీక్వెల్‌ను అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. దాంతో ప్రస్తుతం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సినిమాల్లో పుష్ప2 ముందు వరుసలో ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే స్క్రిప్టు లాక్ చేసిన సుకుమార్.. రీసెంట్గా పూజా కార్యక్రమాలతో కొబ్బరికాయ కూడా కొట్టేశాడు. త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమా పై భారీగా అంచనాలను పెంచేశాడు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్. పుష్ప మూవీ పాటలు, డైలాగ్స్ ఎంత హెలెట్‌గా నిలిచాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా సాంగ్స్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యాయి. దాంతో పుష్ప2 మ్యూజిక్ పై భారీ అంచనాలున్నాయి. తాజాగా దీని పై దేవీ శ్రీ ప్రసాద్ స్పందించాడు.
ఇప్పటికే పుష్ప2 మూవీకి మూడు పాటలు కంపోజ్ చేశానని.. ఆ ట్యూన్స్ నెక్ట్స్ లెవల్ అనేలా ఉన్నాయని.. ఈ విషయంలో నిర్మాతలతో పాటు.. సుకుమార్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడని చెప్పాడు. ఇక స్క్రిప్టు గురించి చెబుతూ.. ఈసారి సుకుమార్ వేరే లెవెల్ స్క్రిప్ట్ రెడీ చేశాడని.. ఊహాకందని విధంగా ఉంటుందని అంచనాలు పెంచేశాడు. అయితే ఇప్పుడే కథ గురించి రివీల్ చేయలేనని చెప్పాడు. దాంతో పుష్ప: ది రూల్ పై అంచనాలు పెంచేసుకుంటున్నారు సినీ అభిమానులు. ఈ విషయంలో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను.. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. దాంతో పుష్ప2 వండర్స్ క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు.