ఆమె ప్రపంచంలోనే ఎత్తైన మహిళ(World’s tallest woman) విమానంలో ప్రయాణించింది. ఆమె విమానం(plane) ఎక్కడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. టర్కీకి చెందిన 25 ఏళ్ల రుమెయ్సా గెల్గీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళగా గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకుంది. టర్కీ నుంచి శాన్ఫ్రాన్సిస్కోకు వెళ్ళడానికి ఆమె మొదటిసారి విమానం ఎక్కింది.
ఈమె కోసం టర్కిష్ ఎయిర్‌లైన్ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. ఆరు సీట్లను ఒక స్ట్రెచర్‌పైకి చేర్చి ఆమె పడుకునేందుకు అనువుగా ఉండేలా చూసింది. ఈ విషయాన్ని రుమెయ్సా గెల్గీ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ద్వారా తెలిపింది. ఈ మేరకు ఎయిర్‌లైన్ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
‘ఇది నా తొలి విమాన ప్రయాణం. నా ఈ మొదటి ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది. నాతోపాటు ప్రయాణించిన వారందరికీ ధన్యవాదాలు. ఈ ప్రయాణం చివరిది కాకూడదని కోరుకుంటున్నా’’ అంటూ పోస్టు చేసింది.