»Seventh Indian Aircraft Lands In Turkey With Medical Equipments
Indian 7th aircraft:మెడికల్ ఎక్విప్ మెంట్స్, వెంటిలేటర్లతో టర్కీకి ఐఏఎఫ్ విమానం
Indian aircraft lands in Turkey:టర్కీ (turkey), సిరియా(syria)లో‘ఆపరేషన్ దోస్త్’ (operation dost) పేరుతో భారత్ సహాయక కార్యక్రమాలు చేపట్టింది. ఏడో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (air force) విమానంలో మందులను పంపించింది. ఆదివారం ఉదయం ఆదానా (adana) ఎయిర్ పోర్టులో ఐఎఎఫ్ సీ 17 (IAF C17) విమానం దిగింది.
Indian aircraft lands in Turkey:టర్కీ (turkey), సిరియా(syria)లో భూకంప సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద వెలికితీత చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. ఆ రెండు దేశాలకు ఇతర దేశాలు సాయం చేస్తున్నాయి. ‘ఆపరేషన్ దోస్త్’ (operation dost) పేరుతో భారత్ సహాయక కార్యక్రమాలు చేపట్టింది. ఏడో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (air force) విమానంలో అవసరమైన సామాగ్రిని పంపించింది. ఆదివారం ఉదయం ఆదానా (adana) ఎయిర్ పోర్టులో ఐఎఎఫ్ సీ 17 (IAF C17) విమానం దిగింది. ఇందులో మందులు, మెడికల్ ఎక్విప్ మెంట్స్ (medical equipments) ఉన్నాయి. 12 టన్నుల మెడిసిన్స్ (12 tonnes) టర్కీకి, 24 టన్నుల మందులను (24 tonnes) సిరియన్లను అందజేస్తారు.
మెడికల్ ఎక్విప్ మెంట్స్
ఆదానా ఎయిర్ పోర్టులో టర్కీలో భారత రాయబారి డాక్టర్ విరేందర్ పాల్ (dr virender paul), రక్షణ శాఖకు చెందిన కల్నల్ మహుజ్ గర్గ్ (col mahuj garg), టర్కీ అధికారులతో కలిసి మెడికల్ ఎక్విప్ మెంట్ తీసుకున్నారు. టర్కీలో గల ఇస్కెన్ డెరున్లో 60 పారా ఫీల్డ్ ఆస్పత్రి (60 para field hospital) కోసం వెంటిలేటర్స్ మిషన్స్, ఆనెస్థిషియా మిషన్స్, ఇతర వస్తువులు, మందులను (medicines) తీసుకొచ్చారు. భారత్కు చెందిన ఈ ఆర్మీ ఆస్పత్రిలో రోజుకు 400 మందికి (400 members) చికిత్స అందజేస్తున్నారని తెలిసింది.
28 వేల మంది మృతి
టర్కీ, సిరియాలలో ఈ నెల 6వ తేదీన పెను భూకంపం (earth quake) సంభవించిన సంగతి తెలిసిందే. రెండు దేశాల్లో భారీ విధ్వంసం జరిగింది. ప్రాణ నష్టం గంట గంటకు పెరుగుతుంది. టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపం వల్ల ఇప్పటికే 28 వేల మంది (28 thousnad people) చనిపోయారు. వేలాది మంది గాయపడ్డారు. శిథిలాల కింద ఇప్పటికీ చాలామంది చిక్కుకుపోయారని అధికారులు (officials) వివరించారు. భూకంపం కారణంగా ఇల్లు, వాకిలి కోల్పోయి లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్న చిన్నారులను సహాయక సిబ్బంది క్షేమంగా బయటకు తీస్తున్నారు. తినేందుకు తిండి లేక.. తాగేందుకు నీరు లేక అలమటిస్తున్నారు. టర్కీ, సిరియాకు చేయూత ఇచ్చేందుకు చాలా దేశాలు ముందుకు వస్తున్నాయి.
In Pictures | Visuals of the 7th Operation Dost flight, IAF C-17 aircraft that departed last night for Syria and Türkiye, carrying relief material and emergency equipment @MEAIndia@IAF_MCC@NDRFHQpic.twitter.com/rggA6vh0E7
ఏడో విమానం
టర్కీ(turkey), సిరియాలో (syria) భూకంపం (earth quake) తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా ఉండటంతో ప్రాణ నష్టం భారీగా జరిగింది. ఆస్తి నష్టం గురించి అయితే చెప్పక్కర్లేదు. శతాబ్దంలో ఎదుర్కొన్న అతిపెద్ద విపత్తు ఇదీ అని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ పేర్కొన్నాడు. ఆ తర్వాత 24 దేశాలకు (24 countries) చెందిన రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. భారత సైన్యం, (indian army), ఎన్డీఆర్ఎఫ్ బృందాలు (ndrf teams) రంగంలోకి దిగాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఫీల్డ్ ఆసుపత్రులను ఏర్పాటు చేసి క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. భారత వైమానికి దళానికి (Iaf) చెందిన ఏడో విమానం (seventh flight) ఆదివారం టర్కీకి చేరుకుంది. అందులో మందులు, మెడికల్ ఎక్విప్ మెంట్స్ ఉన్నాయి.