క్రిమియా కెర్చ్ వంతెన పేల్చివేసిన నేపథ్యంలో..రష్యా మిసైళ్లతో ఉక్రెయిన్ దేశ రాజధానిపై విరుచుకుపడింది. ఈ భీకర దాడుల్లో 8 మంది మృతి చెందగా…మరో 24 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో 15కుపైగా వాహనాలు ధ్వంసమయ్యాయి.
ఈ మేరకు అక్కడి అధికారులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. చివరిసారిగా జూన్ 26న రష్యా సేనలు ఉక్రెయిన్ రాజధానిపై దాడులు జరుపగా…మళ్లీ తాజాగా బ్రిడ్జ్ కూల్చివేతకు ప్రతీకారంగా దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కీలకమైన క్రిమియా రష్యా వంతెన పేలుడుకు ఉక్రెయిన్ దేశమే కారణమని…రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించారు. మరోవైపు అది ఉగ్రవాద చర్యతో సమానమని పేర్కొన్నారు.