Imran Khan:పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను (Imran Khan) వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. వెంటనే కోర్టులో హాజరుపరచాలని బ్యూరోకు సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఇమ్రాన్ అరెస్ట్‌తో పాకిస్థాన్ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే.
ఇమ్రాన్‌ను (Imran) కోర్టు రిజిస్ట్రార్ అనుమతి లేకుండా.. కోర్టు ఆవరణలోకి ప్రవేశించి అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టింది. ఇదీ కోర్టు ధిక్కారం అవుతుందని తెలిపింది. అల్ ఖాదిర్ కేసులో అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ఇమ్రాన్ కాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను పాకిస్థాన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉమర్ అటా బండియాల్, జస్టిస్ మహ్మద్ అలీ మజార్, జస్టిస్ అథర్ మినాల్లాతో కూడిన ధర్మాసనం విచారించి.. ఆదేశాలు జారీచేసింది.
కేసులో హాజరయ్యేందుకు లాహోర్ నుంచి ఇస్లామాబాద్ వచ్చిన ఆయనను (Imran) హైకోర్టు ప్రాంగనంలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ప్రాంగణంలోకి 90 మంది ప్రవేశిస్తే కోర్టు గౌరవం ఎక్కడ ఉంది అని అడిగింది. ఏ వ్యక్తిని అయినా సరే కోర్టు ప్రాంగణం నుంచి అరెస్ట్ చేయొచ్చా అని చీఫ్ జస్టిస్ అన్నారని డాన్ రిపోర్ట్ చేసింది.
ఇదివరకు కోర్టు లోపల విధ్వంసం చేసిన లాయర్లపై (lawyers) చర్యలు తీసుకున్నామని పేర్కొంది. ఓ వ్యక్తి కోర్టు ఎదుట లొంగిపోయిన తర్వాత.. అరెస్ట్ చేయడం దేనికి సంకేతం అని అడిగింది.