Beyond Oscar : ఇది ఆస్కార్‌కు మించి.. ఏడ్చేసిన కీరవాణి, థ్యాంక్స్ చెప్పిన రాజమౌళి!
Oscars: 'ఆస్కార్' అనేది సినిమా వాళ్లకు ఎవరెస్ట్ శిఖరం. ఇప్పటి వరకు తెలుగు సినిమాలకు కూడా ఆస్కార్ వస్తుందా.. అని ఎవరు అనుకోలేదు. కానీ దర్శక ధీరుడు రాజమౌళి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. 95వ ఆకాడమీ అవార్డ్స్‌లో ట్రిపుల్ ఆర్‌లోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో.. ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుంది.
‘ఆస్కార్’ అనేది సినిమా వాళ్లకు ఎవరెస్ట్ శిఖరం. ఇప్పటి వరకు తెలుగు సినిమాలకు కూడా ఆస్కార్ వస్తుందా.. అని ఎవరు అనుకోలేదు. కానీ దర్శక ధీరుడు రాజమౌళి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. 95వ ఆకాడమీ అవార్డ్స్‌లో ట్రిపుల్ ఆర్‌లోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో.. ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుంది. ఆస్కార్ వేదిక పై సంగీత దర్శకుడు కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ ఆస్కార్ అందుకున్నారు. ఈ సందర్భంగా జీవితానికి ఇది చాలు అన్నట్టుగా.. ఇద్దరు ప్రౌడ్‌గా ఫీలయ్యారు. చంద్రబోస్ నమస్తే అని సంతోషాన్ని వ్యక్తం చేయగా.. కీరవాణి మాత్రం రిచర్డ్ కార్పెంటర్‌కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఆస్కార్ వేదికపై అవార్డు అందుకున్న తర్వాత తాను కార్పెంటర్ సంగీతం వింటూ పెరిగానని, పాట పాడుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ రిచర్డ్ కార్పెంటర్ నుంచే కీరవాణికి ప్రశంస వచ్చింది. అది కూడా పాట రూపంలో స్వయంగా తనే పాడి.. శుభాకాంక్షలు తెలియజేస్తూ వీడియోను షేర్ చేశారు. దీంతో ‘ఇది నేను అసలు ఊహించలేదు.. ఆనంద భాష్పాలు వస్తున్నాయి.. ఇదే తనకు అద్భుతమైన బహుమతి’ అని కీరవాణి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. దీని పై రాజమౌళి కూడా స్పందించాడు. ‘ఆస్కార్ అవార్డు అందుకున్న సమయంలో.. అంతకు ముందు నామినేషన్స్‌లో నిలిచిన సమయంలోను.. అన్నయ్య కీరవాణి ఉద్వేగానికి గురి కాలేదు.. కానీ మీ వీడియో చూసిన తర్వాత ఉద్వేగానికి లోనయ్యడు.. ఇది తమకు మోస్ట్ మెమోరబుల్ మూమెంట్’ అని రాజమౌళి అన్నారు. దాంతో నిజంగానే ఇది కీరవాణికి ఆస్కార్‌కు మించిన అవార్డ్ అని చెప్పొచ్చు.