»It Has Been A Year Since The War Between Russia And Ukraine
Russia vs Ukraine: రష్యా, ఉక్రెయిన్ల యుద్ధం మొదలై ఏడాది పూర్తి
రష్యా, ఉక్రెయిన్(Russia vs Ukraine) దేశాల మధ్య గత ఏడాది ఇదే రోజున యుద్ధం(War) మొదలైంది. ఇప్పటికి 365 రోజులు గడిచినా ఆ యుద్ధం(War) ఇంకా ఆగలేదు. ఆ యుద్ధానికి ఎండ్ కార్డ్ పడలేదు. ప్రపంచ దేశాలన్నీ(World Nations) ఆ యుద్ధాన్ని ఆపాలని చూస్తున్నా రష్యా(Russia) మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
రష్యా, ఉక్రెయిన్(Russia vs Ukraine) దేశాల మధ్య గత ఏడాది ఇదే రోజున యుద్ధం(War) మొదలైంది. ఇప్పటికి 365 రోజులు గడిచినా ఆ యుద్ధం(War) ఇంకా ఆగలేదు. ఆ యుద్ధానికి ఎండ్ కార్డ్ పడలేదు. ప్రపంచ దేశాలన్నీ(World Nations) ఆ యుద్ధాన్ని ఆపాలని చూస్తున్నా రష్యా(Russia) మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రష్యాతో యుద్ధం అంటే అవతల ఏ దేశం ఉన్నా ఇట్టే ఓడిపోతుందని అన్నారంతా. కానీ చిన్న దేశం అయిన ఉక్రెయిన్(Ukraine) గెలుపు కోసం రష్యాతో పోరాడుతూనే ఉంది. ఈ యుద్ధం మొదలై ఏడాది పూర్తయ్యింది.
ఉక్రెయిన్(Ukraine) ప్రజలు రష్యా సైనికుల(Russia Soldiers) చర్యలకు బిక్కుబిక్కు మన్నారు. ఉక్రెయిన్(Ukraine) ప్రజల ముందు తమ వారంతా బూడిదైపోతుంటే గుండె పడిలేలా ఏడ్చారు. బాంబుల శబ్దాలు ఉక్రెయిన్ ను భయాందోళనకు గురి చేశాయి. ఎప్పుడు వచ్చి ఎవరు తమను చంపుతారోనని ఉక్రెయిన్ ప్రజలు అల్లాడిపోయారు. ఉక్రెయిన్(Ukraine)పై రష్యా సాగిస్తున్న నిర్విరామ దాడుల్లో వేలాది మంది ప్రాణాలు వదిలారు. భీకర బాంబుల వర్షంలో ఉక్రెయిన్ నగరాలు చిన్నాభిన్నం అయ్యాయి. పెద్ద పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి. ఏడాది పూర్తైనా ఈ యుద్ధం మాత్రం ఇంకా ముగిసిపోలేదు.
రష్యా, ఉక్రెయిన్(Russia vs Ukraine) దేశాల మధ్య యుద్ధం కారణంగా ఇరు దేశాలకు చెందిన 3 లక్షల మందికి పైగా సైనికులు(Soldiers) ప్రాణాలు విడిచారు. యుద్దం(War) కారణంగా విదేశాలకు వెళ్లిపోయిన వారి సంఖ్య లక్షల్లోనే ఉంది. ఇతర దేశాలకు వెళ్లిన శరణార్థుల సంఖ్య 80 లక్షలపైమాటేనని గణాంకాలు తెలుపుతున్నాయి. ఉక్రెయిన్(Ukraine) శరణార్థులైన 15 లక్షల మందికి పోలండ్ ఆశ్రయం కల్పించింది. యుద్ధం(War) కారణంగా ఉక్రెయిన్ లో దెబ్బతిన్న నగరాల పునర్నిర్మాణానికి రూ.29 లక్షల కోట్లు ఖర్చు అవ్వనున్నట్లు ఆ దేశం అంచనా వేసింది. ఇకనైనా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం(Russia vs Ukraine War) ఆపాలని ప్రపంచ దేశాలు సూచిస్తున్నాయి. అయితే రష్యా(Russia) మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దీంతో ఈ యుద్ధానికి ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు.