Global Warming : 2029లో సమయాన్ని మార్చాల్సిందేనా?

వేగంగా మారుతున్న ప్రపంచపు ఉష్ణోగ్రతల వల్ల భూమి తిరిగే వేగంలో కొన్ని మిల్లీ సెకెన్ల మేర తేడా వస్తోందట. ఫలితంగా 2029 నాటికి సమయాన్ని కొద్దిగా మార్చవలసి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Written By:
  • Publish Date - March 29, 2024 / 01:59 PM IST

Global Warming : భూమి తన చుట్టూ తాను తిరిగి రావడానికి 24 గంటల సమయం పడుతుందన్నది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఆ సమయాలు కాస్త మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిపిన పరిశోధనల్లో అమెరికన్‌ శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా శాన్‌ డియాగోలోని స్క్రిప్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషియానోగ్రఫీకి చెందిన పరిశోధకులు చేసిన ఈ అధ్యయనం వివరాలు నేచర్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

చదవండి : కాంగ్రెస్ పార్టీకి రూ.1700 కోట్ల ఐటీ నోటీసు

గ్లోబల్‌ వార్మింగ్‌(Global Warming) కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగిపోతున్నాయి. ఆ ప్రభావం భూమి తన చుట్టూ తాను తిరగడంపైనా పడుతోంది. ఉష్ణోగ్రతలు నానాటికీ పెరుగుతూ ఉండటం వల్ల అంటార్కిటికా, గ్రీన్‌ లాండ్‌ లాంటి ప్రాంతాలనుంచి అత్యంత వేగంగా మంచు కరిగి భూమధ్య రేఖ ప్రాంతం వైపు పయనిస్తోంది. అందువల్ల భూమి తిరిగే వేగంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

చదవండి :  లాంబొర్గిని కార్ల  రికార్డు సేల్స్‌!

భూమి తన చుట్టూ తాను తిరగడానికి సాధారణంగా 24 గంటలు పడుతుంది. అయితే ఇప్పుడు ప్రతి రోజూ కొన్ని మిల్లీ సెకెన్ల మేర తేడా వస్తున్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. కాబట్టి సమయాన్ని, భూమి తిరిగే వేగానికి సరిపోయేలా మార్చడానికి 2029లో కో ఆర్డినేటెడ్‌ యూనివర్సల్‌ టైమ్‌(యూటీసీ) నుంచి ఒక సెకనును తగ్గించాలని సూచించారు. దీనినే నెగిటివ్‌ లీప్‌ సెకెండ్‌( Negative leap second) అని పిలుస్తారు. ఈ ప్రభావం స్మార్ట్‌ ఫోన్లు, కంప్యూటర్ల వ్యవస్థపై పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.