అమెరికాలోని న్యూయార్క్(New York)లో కుండపోతగా వర్షం కురిసింది. దీంతో ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. దీంతో వీధులన్నీ జలమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు ఇళ్లల్లోకి చేరింది. వరద కారణంగా రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.సబ్ వేలలోకి వరద నీరు చేరడంతో అధికారులు అన్ని ట్త్రెన్స్ (Trains)ను రద్దు చేశారు. న్యూయార్క్ ఎయిర్ పోర్ట్‌లోకి వరద చేరింది. దీంతో ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసివేసి, విమానాలను మళ్లించారు.
శనివారం కూడా భారీవర్షం (Heavy rain) కురుస్తుండడంతో వరద ముప్పు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షం, వరదలకు సంబంధించి జాతీయ వాతావరణ శాఖ (Weather Dept) న్యూయార్క్ వాసులకు హెచ్చరికలు జారీ చేసింది. కుండపోత వర్షాల నేపథ్యంలో ఇళ్లల్లోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా, రెండేళ్ల కిందట కూడా సెప్టెంబర్ నెలలోనే అమెరికాలో వరదలు బీభత్సం సృష్టించాయి. బ్రూక్లిన్(Brooklyn), క్వీన్స్ రాష్ట్రాల్లో వరదల కారణంగా గతేడాది 13 మంది చనిపోయారు. న్యూయార్క్ నగరం, లాంగ్ ఐలాండ్(Island), హడ్సన్ వ్యాలీ అంతటా ఎమర్జెన్సీని ప్రకటిస్తున్నానని చెప్పారు.
విపరీతమైన వర్షపాతం కారణంగా ప్రాంతం అంతా జలమయం అయింది. నదులను తలపిస్తున్నాయి. కనుక ప్రజలు తమకు తాము సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని.. ప్రస్తుతం రోడ్డు మీద ప్రజలు ప్రయాణించవద్దు అంటూ హెచ్చరించారు. ప్రిసిల్లా ఫోంటెల్లియో (Fontellio) అనే మహిళ తన కారులో మూడు గంటల పాటు చిక్కుకుపోయిందని చెప్పారు. తన జీవితంలో ఇలాంటి సంఘటనలు చూడలేదని ఫోంటెల్లియో చెప్పారు. ప్రస్తుతం నగరంలోని వర్షాలు, వరదలకు సంబంధించిన చాలా వీడియో(Video)లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ వీడియోల్లో నగరంలో చుట్టూ నీరు కనిపిస్తుంది. రోడ్లపై కార్లు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరింది.