Deep tragedy at Barack Obama's house.. Michelle's mother died
Michelle Obama: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama) ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒబామా సతీమణి మిచెల్ ఒబామా (Michelle Obama) తల్లి మరియన్ రాబిన్సన్ (Marian Robinson) మరణించారు. 86 ఏళ్ల మరియన్ రాబిన్సన్ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని బరాక్ ఒబామా ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో మరియన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మరియన్ కూడా కూతురు, అల్లుడుతో కలిసి శ్వేత సౌధంలోనే నావాసం ఉన్నారు. ఆ సమయంలో ఒబామా ఇద్దరు పిల్లలు మాలియా, సాషాల సంరక్ష బాధ్యతలను ఆమె చూసుకున్నారు. ఆమెరికా ప్రథమ పౌరుడు బరాక్ ఒబామా ఆయన సతీమణి ఫస్ట్ అమెరికన్ లేడీ అని పిలుచుకునే సమయంలో మరియన్ను కుటుంబ సభ్యులు ఆమెను ముద్దుగా మొదటి బామ్మ అని పిలిచేవారు. అప్పటినుంచి అదే పేరుతో ప్రేమగా పిలుచుకుంటారట. తన మరణవార్త విన్న అంతర్జాతీయ మీడియ సంస్థలు, ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.