అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం రెండో పెళ్లి చేసుకున్నాడు. గతేడాది సెప్టెంబర్ నెలలో ఆయన పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని దావూద్ సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలీషా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) అధికారులకు తెలియజేశాడు. ఆయన తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకముందే …పాకిస్తాన్ కి చెందిన మహిళను రెండో వివాహం చేసుకున్నాడు.
టెర్రర్ ఫండింగ్ కేసులో భాగంగా దావూద్ ఇబ్రహీంపై గతంలో కేసు నమోదు చేసింది ఎన్ఐఏ . ఈ క్రమంలో దావూద్‌తో సంబంధం ఉన్న పలువురిని అరెస్ట్ చేసింది. వీరిలో దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలీషాహ్ పార్కర్ కూడా ఉన్నాడు. విచారణలో భాగంగా.. అలీషాహ్ స్టేట్మెంట్ను తీసుకున్న అధికారులు.. టెర్రర్ ఫండింగ్ కేసులో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. దర్యాప్తులో భాగంగా ఆయన దావూద్ కి సంబంధించిన పలు విషయాలను అధికారులకు వెల్లడించాడు. అందులో భాగంగానే.. దావూద్ రెండో పెళ్లి విషయాన్ని బయటపెట్టాడు.
దావూద్ ఇబ్రహీం తన మొదటి భార్య మెహజబీన్ షేక్‌కు ఇంకా విడాకులు ఇవ్వలేదని అలీ షా ఎన్ఐఏకు తెలిపాడు. దావూద్ రెండవ వివాహం మెహజబీన్ నుంచి దర్యాప్తు సంస్థల దృష్టిని మరల్చడానికి చేసిన ప్రయత్నం కూడా కావచ్చని అనుమానిస్తున్నారు.2022 వసంవత్సరం జులై నెలలో తాను దావూద్ ఇబ్రహీం మొదటి భార్యను దుబాయ్‌లో కలిశానని, దావూద్ రెండో మహిళతో దావూద్ వివాహం గురించి ఆమె తనకు చెప్పిందని అలీ షా చెప్పారు.మెహజబీన్ షేక్ వాట్సాప్ కాల్స్ ద్వారా భారతదేశంలోని దావూద్ బంధువులతో సంబంధాలు కొనసాగిస్తున్నారని అలీషా పేర్కొన్నాడు.దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ దేశంలోని కరాచీ నగరంలో ఉన్నాడని అలీ షా ఎన్ఐఏ అధికారులకు చెప్పాడు.