భూ ప్రకంపనాలతో టర్కీ, సిరియా గజగజ వణుకుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి మూడుసార్లు భూకంపం వచ్చింది. తీవ్రత కూడా రిక్టర్ స్కేల్‌పై 7.8 నమోదవడంతో ప్రాణ నష్టం ఎక్కువగానే ఉంది. భూ ప్రకంపనాలతో వందలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నారు. రెండు దేశాల్లో కలిసి ఇప్పటివరకు 1904 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 1939 తర్వాత తమ దేశంలో వచ్చిన పెద్ద భూకంపం ఇదేనని టర్కీ అధ్యక్షుడు ఈడొడ్గన్ పేర్కొన్నారు. టర్కీలో 1121 మంది చనిపోగా.. సిరియాలో 738 మంది మృతిచెందారు. రెండు దేశాల్లో కలిపి 1904 మంది చనిపోయారు.
గాజియాన్ తెప్ ప్రాంతంలో 18 కిలోమీటర్ల లోపు భూకంప కేంద్రం గుర్తించారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా ఉంది. మధ్యాహ్నం టర్కీలో మరోసారి భారీ భూకంపం వచ్చింది. దీని తీవ్రత 7.5గా ఉంది. ఆ తర్వాత 6 తీవ్రతతో మరోసారి భూ ప్రకంపనాలు వచ్చాయి. నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగనున్నాయి. రెండు దేశాల్లో కలిసి మృతుల సంఖ్య 5 వేల నుంచి 10 వేల వరకు ఉండొచ్చు అని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆస్తి నష్టం కూడా భారీగానే జరిగిందని చెబుతున్నారు.
టర్కీ, సిరియాల్లో భూకంపంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆ దేశాలకు అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. టర్కీకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించారు. వారితో వైద్యులు, మెడిసన్స్ కూడా ఉన్నాయి.
Turkey earthquake: PM Modi offers assistance; India to send in NDRF, medical teams Turkey earthquake: Prime Minister Narendra Modi on Monday condoled the loss of lives in Turkey after an earthquake of 7.8 magnitudes rocked the nation and neighbouring regions, killing close t… pic.twitter.com/5AqBOoMuTh