బాంగ్లాదేశ్ లో జరుగుతున్న హింసా ఖండ, పరిస్థితులు యావత్ ప్రపంచాన్ని భయభ్రఅంథులకు గురిచేస్తుంది. స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు రిజర్వేషన్ల ఇస్తున్న అంశంపై బాంగ్లాదేశ్ ప్రజలకు, యువతకు అక్కడ ప్రభుత్వంపై, షైక్ హసీనా పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడి ఏకంగా ప్రధాని నివాసంపైనే దాడికి పాల్పడి, ప్రధాని నివాసంలోకి చొరబడ్డారు ఆందోళనకారులు. ప్రధాని నివాసానికి పూర్తిగా లూటీ చేసి, పూర్తిగా ద్వాంసం చేసారు. ఈ సమాచారం అందుకుని, జరిగే పరిస్థితులు ముందుగానే పసిగట్టి ప్రధాని షైక్ హసీనా ఆమె సోదరితో ప్రత్యేక ఛాపర్ లో భారత్ కు బయలుదేరారు.
జాతీయ భద్రత సలహాదారులు అజిత్ దోవల్, మరికొంతమంది ఆర్మీ ప్రతినిధులు ఘజియాబాద్ లో హసీనాను రిసీవ్ చేసుకుని, సురక్షిత ప్రాంతానికి తరలించారు. అనంతరం బాంగ్లాదేశ్ లో జరిగిన పరిస్థితులపై ప్రధాని మోడీ తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అజిత్ దోవల్, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్, అమిత్ షా, జై శంకర్ పాల్గొన్నారు. షైక్ హసీనా రేపు, లేదా ఎల్లుండి భారత్ నుంచి లండన్ వెళ్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
భరత్- బాంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాలలో భద్రతను పెంచింది భారత్ .. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదురించడానికి సన్నాహాలు చేస్తుంది భారత ప్రభుత్వం. బాంగ్లాదేశ్ లో జరిగిన దాడుల్లో దాదాపు 300 మంది మృతిచెందారు, 100మంది పోలీసులు సైతం అల్లర్లలో మృతి చెందారు.