»A Woman Has Two Pregnancies At The Same Time Shocking Doctors
Uteruses Pregnant: ఒకేసారి మహిళకు రెండు గర్భాలు..షాకైన వైద్యులు
అమెరికాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒకే మహిళకు రెండు గర్భాశయాలు ఉండటంతో వైద్యులు ఆశ్చర్యపోయారు. ఇటువంటి ఘటనలు అరుదుగా నమోదవుతాయని, రెండు గర్భశయాల్లో ఇద్దరు శిశువులు ఉండటం రేర్ కేసుగా నమోదవుతుందని వైద్యులు తెలిపారు.
వైద్యరంగంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళకు రెండు గర్భాలు ఉండటాన్ని గమనించిన డాక్టర్లు షాక్ అయ్యారు. రెండు గర్భాల్లో ఒకేసారి ఇద్దరు శిశువులు పెరగడం చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. ఇలా రెండు గర్భాల్లో ఇద్దరు శిశువులు పెరగడం చాలా అరుదుగా జరుగుతుందని వైద్యులు వెల్లడించారు. గర్భశయాలు ఉన్నా కూడా ఆ రెండింటిలోనూ శిశువులు పెరగడం అరుదుగా జరుగుతుందని వైద్యులు స్పష్టం చేశారు. ఇది చాలా రిస్క్ కేసని, డెలివరీ సమయంలో రిస్క్ కచ్చితంగా ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ విచిత్ర ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
దక్షిణ అమెరికాలో కెల్సీ హాట్చర్, కాలేబ్ అనే దంపతులు అలాబామా రాష్ట్రంలో నివశిస్తున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. తాజాగా కెల్సీ హాట్చర్ మరోసారి గర్భం దాల్చగా ఆమెకు రెండు గర్భాశయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆ రెండు గర్భాల్లో ఇద్దరు శిశువుల ఉన్నారని, ఆ మహిళకు ఇది వరకూ వైద్యులు తెలిపారు. అయితే ఈసారి రెండు గర్భాశయాల్లో ఇద్దరు శిశువులు పెరగడం వైద్యులకు ఆశ్చర్యం కలిగించింది.
సాధారణంగా గర్భాశయంలో ఇద్దరు శిశువులు ఉంటే కవలలు అంటారని, అయితే రెండు గర్భాశయాల్లో ఇద్దరు శిశువులు వేర్వేరుగా ఉండటం చూసి వైద్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పిండాలు పెరుగుతున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని గైనకాలజిస్ట్ డాక్టర్ శ్వేతా పటేల్ తెలిపారు. అలా పిండాలు రెండు ఉండటం చాలా అరుదుగా జరుగుతుందని శ్వేత పటేల్ వెల్లడించారు. రెండు గర్భాశయాల్లో పెరుగుతున్న వారు ఆరోగ్యం ఉన్నట్లు చెప్పలేమని, వైద్యపరంగా ఇటువంటి కేసులు హై రిస్క్ కేసుగా నమోదవుతాయని తెలిపారు.