భారత సంతతికి చెందిన యువకుడు అమెరికా (America) అధ్యక్షడు జో బైడెన్‌ని హత్య చేయాలని యత్నంచిటం తీవ్ర కలకలం రేపింది. యువకుడు వైట్‌హౌస్ (White House) పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకొచ్చి బారికేడ్లను ఢీకొట్టాడు. అతను సోమవారం రాత్రి 10 గంటలకు ఈ ఘటనకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న యూఎస్ పోలీసులు (US Police) అతను లాఫాయోట్ పార్క్ వెలుపల ఉన్న బోలార్డ్‌లోకి ఉద్దేశ పూర్వకంగా డ్రైవింగ్ చేసినట్లు తెలిపారు.దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ట్రక్కుపై నాజీ జెండాను పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. సదరు యువకుడిని భారత సంతతికి చెందిని తెలుగు యువకుడు సాయివర్షిత్ (Saivarshit) కందులగా గుర్తించారు. అతన్ని విచారించగా అమెరికా అధ్యక్షుడిపై దాడి చేసేందుకు ఆరు నెలలుగా ప్లాన్ చేశానని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అతనిపై ర్యాష్ డ్రైవింగ్ (Rash driving), ఆస్తుల ధ్వంసంతో పాటు అధ్యక్షుడి హత్యకు కుట్ర పన్నిన కేసులు నమోదు చేశారు.ఛెస్ట్ ఫీల్డ్ కి చెందిన సాయి వర్ధన్ ఇటీవల మార్క్వెట్ సీనియర్ హైస్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేశాడు. సాయి వర్ధన్ పై పలు అభియోగాలు నమోదు చేసి కేసు ఫైల్ చేసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. అతడి మానసిక స్థితి గురించి కూడా చర్చ జరుగుతోంది.