హైదరాబాద్ లో కోహినూర్ గ్రూప్ పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. రియల్ ఎస్టేట్ కంపెనీల(Hyderabad Real Estate company)పై ఏకకాలంలో 30 చోట్ల ఐటీ సోదాలు(IT Raids) జరుగుతున్నాయి.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీల(Hyderabad Real Estate company)పై ఏకకాలంలో 30 చోట్ల ఐటీ సోదాలు(IT Raids) జరుగుతున్నాయి. కోహినూర్ గ్రూప్‌తో పాటుగా మరొక రియల్ ఎస్టేట్ కంపెనీలో కూడా ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటుగా నగర శివారు ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కోహినూర్ కంపెనీ(Kohinur Company)లో అధికారులు సోదాలు చేపట్టారు. కోహినూర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎమ్డీ అయిన మజీద్‌తో పాటుగా డైరెక్టర్ల వద్ద ఐటీ సోదాలు చేస్తున్నారు.
ఒక రాజకీయ నాయకుడికి కోహినూర్ గ్రూప్(Kohinur Company) బినామిగా ఉన్నట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో వెంచర్లు వేసినట్లుగా వారి వద్ద ఆధారాలు ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో కోహినూర్ గ్రూప్ పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు.
చెన్నైకి చెందిన రియల్ ఎస్టేట్(Real Estate) కంపెనీ జీ స్వకేర్ కంపెనీకి సంబంధించి కూడా చెన్నైతో పాటు మరో 50 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు(IT Raids) నిర్వహిస్తున్నారు. దక్షిణ భారతదేశంలోని ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో జీ స్వకేర్ సంస్థ వ్యాపారం చేస్తోంది. ఈ కంపెనీ పెద్ద ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడుతోందని ఐటీ అధికారులు సోదాలు(IT Raids) చేపడుతున్నారు. హైదరాబాద్ లో కూడా ఈ సంస్థ రెండు వెంచర్లను ప్రారంభించింది.