»A Superyacht That Runs At A Speed Of 140 Km Per Hour On Water Is Ready
Plectrum: నీటిపై గంటకు 140 కి.మీ వేగంతో నడిచే సూపర్యాచ్ రెడీ
ఇప్పటి వరకూ నేలపై వేగంగా ప్రయాణించే వాహనాలను(Vehicles) కొనుగొన్నారు. టెక్నాలజీ అభివృద్ధి జరుగుతున్న తరుణంలో ఇంకా అడ్వాన్స్డ్ వాహనాల(Advanced vehicles)ను తయారు చేస్తున్నారు. తాజాగా నీటిపై గంటకు 140 కిలో మీటర్ల వేగంతో ఎగిరే హైడ్రోజన్ సూపర్ యాచ్(hydrogen superyacht)ను పరిశోధకులు కనుగొన్నారు. ఇదొక అన్ని వసతులతో కూడిన బోట్(Boat).
ఇప్పటి వరకూ నేలపై వేగంగా ప్రయాణించే వాహనాలను(Vehicles) కొనుగొన్నారు. టెక్నాలజీ అభివృద్ధి జరుగుతున్న తరుణంలో ఇంకా అడ్వాన్స్డ్ వాహనాల(Advanced vehicles)ను తయారు చేస్తున్నారు. తాజాగా నీటిపై గంటకు 140 కిలో మీటర్ల వేగంతో ఎగిరే హైడ్రోజన్ సూపర్ యాచ్(hydrogen superyacht)ను పరిశోధకులు కనుగొన్నారు. ఇదొక అన్ని వసతులతో కూడిన బోట్(Boat).
సమతలంగానూ, వంకరగానూ ఉండే నీటి ఉపరితలంపై ఉండే రెక్కను హైడ్రోఫాయిల్(hydrofoil) అంటారు. ఇది నీటి మీద ప్రయాణం చేసే ఓడ(Boat) లేద నావ, వాహనాలను పైకి లేపుతుంది. నీటి తాకిడి పెరిగే కొద్దీ ఇది పైకి లేస్తుంది. దీనిని ఎక్కువగా ఓడ(Ships)లలో ఉపయోగిస్తారు. మొట్టమొదటి హైడ్రోఫాయిల్(hydrofoil)ను ఫోర్లనిని అనే ఇటలీ(Italy) దేశస్తుడు 1898లో రూపొందించాడు. 1918లో విమానం ఇంజన్ ను అమర్చిన హైడ్రాఫాయిల్(hydrofoil) నీటిపై ప్రయాణించి అత్యంత వేగమైన రికార్డును నెలకొల్పింది.
1970 నుంచి ఇటువంటి ఓడ(Ships)లను, నౌకాదళపు వాహనాలలో వాడటం మొదలు పెట్టారు. వీటి వేగం 80 నాట్ లుగా ఉండేది. 1950 నుంచి వీటిని అమెరికా, కెనడా, రష్యా దేశాలు ఎక్కువగా అభివృద్ధి చేయడం మొదలు పెట్టాయి. ఓడ(Ships)ను నీటిపైకి ఎత్తటమే ఈ హైడ్రోఫాయిల్(hydrofoil) పని. తాజాగా నీటిపై అత్యంత వేగంగా ప్రయాణించే లగ్జరీ యాచ్(Luxury yacht)ని రూపొందించారు. ఒక ఇంట్లో ఉండే అన్ని వసతులు ఈ యాచ్(Yacht)లల్లో ఉంటాయి.
తాజాగా ఇటాలియన్ డిజైన్ స్టూడియో(Italian design studio) లాజారిని లగ్జరీ యాచ్ ని రెడీ చేసింది. ఈ లగ్జరీ యాచ్ ని ప్లెక్ట్రమ్(Plectrum) అని పిలుస్తారు. ఇది 74 మీటర్ల పొడవుతో ఉంటుంది. ఇది హైడ్రోఫాయిల్(hydrofoil)కు సమానమైన సిస్టమ్. అత్యంత వేగవంతంగా నీటిపై ఇది ప్రయాణిస్తుంది. గాలి ద్వారా నెట్టబడటానికి బదులుగా ప్లెక్ట్రమ్(Plectrum) కదులుతుంటుంది. దీని ద్వారా నౌక నీటి ఉపరితలంపై వేగంగా ముందుకు సాగుతుంది.
డిజైన్ స్టూడియో రూపొందించిన ఈ బోట్ మొత్తం డ్రై కార్బన్ ఫైబర్ తో నిర్మించింది. ఇది ఫాయిల్ సిస్టమ్ తో అమర్చబడి ఉంటుంది. సెయిల్ యాచ్ తో ఇది అనుసంధామై ఉంటుంది. ఈ యాచ్ లో నాలుగు డెక్ లు ఉంటాయి. ప్రధాన డెక్ లో యజమాని సూట్ తో పాటుగా ఆరు క్యాబిన్లు ఉంటాయి. ఇందులో 12 అతిథులు ఉండొచ్చు. ఈ ప్లెక్ట్రమ్(Plectrum) లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది.
ఈ సూపర్యాచ్(superyacht))లో రెండు గ్యారేజీలు కూడా ఉన్నాయి. ఒకటి వస్తువులు పెట్టుకోవడానికి, మరొకటి కార్లు, ఇతర వాహనాలు పెట్టుకోవడానికి ఉంది. ఇందులో హెలికాప్టర్లను ల్యాండ్ చేసేందుకు కూడా స్థలం ఉంది. ఈ బోట్ లో పడక గదులు, స్నానపు గదులు, విశ్రాంతి గదులు ఉంటాయి. విలాసవంతమైన ఈ సూపర్ యాచ్(superyacht) రాబోవు రోజుల్లో మరింత వాడుకలో రానుంది.