»These Are Symptoms Of Heart Attack Shows Up In Your Body Before Half An Hour
Health Tips: అలర్ట్..గుండెపోటుకు అరగంట ముందు కనిపించే లక్షణాలివే!
గుండెపోటు(Heart Attacks) ప్రమాదాలు ఎక్కువగా మగవారిలోనే కనిపిస్తున్నాయి. ఇటీవలె కొన్ని పరిశోధనల్లో ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నవారిలో మగవారు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఫ్యామిలీ టెన్షన్లు, అప్పుల భారాలు, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, కుటుంబ కలహాలు, మనోవేదనలు, ఫాస్ట్ ఫుడ్(Fast Foods) తినడం ఇలాంటి మరెన్నో గుండెపోటుకు కారణమయ్యి మగవారి ప్రాణాలను తీస్తున్నాయి. అందుకే డాక్టర్లు పలు జాగ్రత్తలు చెబుతున్నారు.
ఈమధ్య కాలంలో చాలా మంది గుండెపోటు(Heart Attacks)కు గురై ప్రాణాలు వదులుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఈ గుండెపోటు అన్ని వయసుల వారినీ వేధిస్తోంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో యువత(Youth)లో ఈ గుండెపోటు లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయి. నిండా 30 ఏళ్లు కూడా నిండని వారిలో గుండెపోటు(Heart Attack) ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు(Food Habits), వ్యసనాలు, ఒత్తిడి(Pressure), టెన్షన్లు వంటివి గుండెపోటుకు కారణాలవుతున్నాయి.
ఈ గుండెపోటు(Heart Attacks) ప్రమాదాలు ఎక్కువగా మగవారిలోనే కనిపిస్తున్నాయి. ఇటీవలె కొన్ని పరిశోధనల్లో ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నవారిలో మగవారు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఫ్యామిలీ టెన్షన్లు, అప్పుల భారాలు, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, కుటుంబ కలహాలు, మనోవేదనలు, ఫాస్ట్ ఫుడ్(Fast Foods) తినడం ఇలాంటి మరెన్నో గుండెపోటుకు కారణమయ్యి మగవారి ప్రాణాలను తీస్తున్నాయి. అందుకే డాక్టర్లు పలు జాగ్రత్తలు చెబుతున్నారు.
గుండెపోటు(Heart Attacks) ప్రమాదం వచ్చే అరగంటకు ముందు కొన్ని లక్షణాలను బట్టి అది గుండెపోటును అని అర్థం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గుండె భారంగా, అసౌకర్యంగా అనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని వైద్యులు(Doctors) సూచిస్తున్నారు. అలాగే రక్తం సరాఫరా తగ్గినట్లయితే గుండెల్లో మంటగా ఉండటం ఎక్కువ ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ లక్షణం కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. అలాగే తరచుగా జలుబు, జ్వరం, దగ్గు వస్తున్నా కూడా అవి ఎంతకీ తగ్గకపోయినా గుండె(Heart) నొప్పికి సూచనలుగానే చూడాలి.
తీవ్రమైన అలసట, ఒళ్ళు నొప్పులు(Body Pains) వస్తున్నా కూడా అశ్రద్ధ చేయకుండా తగిన మందులు వాడాలి. వికారం, ఆహారం జీర్ణం కాకపోవడం, గ్యాస్, అసిడిటీ(ACDT) వంటి సమస్యలు బాధిస్తుంటే కచ్చితంగా గుండె నొప్పికి దారితీస్తాయి. అందుకే డాక్టర్(Doctor)ను సంప్రదించడం మంచిది. మత్తు లేదా మగతగా ఉన్నా, చెమటలు ఎక్కువగా పడుతున్నా గుండె నొప్పికి సూచనగా భావించాలి. గుండె నొప్పికి ముందు శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుందని గ్రహించి ఆ లక్షణం కనిపిస్తే వెంటనే అప్రమత్తమవ్వాలి. మాట్లాడేటప్పుడు గందరగోళానికి గురి కావడం, చెప్పాలనుకునే విషయాన్ని చెప్పలేకపోవడం, ఒకే విషయాన్ని ఎక్కువ సార్లు చెప్పడం వంటివి మీలో కనిపిస్తే అది గుండెపోటు(Heart Attacks)కు సంకేతాలుగా భావించి దగ్గర్లోని వైద్యుడిని సంప్రదించాలి.