• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆరోగ్యం

ముఖంపై మొటిమలు తగ్గాలంటే..!

మొటిమల సమస్యతో బాధపడేవారు ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పాలు, ఆకుకూరలు, వాల్‌నట్స్, ఆలివ్ నూనె, బీన్స్, గుడ్లు, అవిసె గింజలు వంటివి తీసుకోవడం వల్ల చర్మం మెరుగుపడుతుంది. రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీ, కొబ్బరినీళ్లు, తగినంత నీరు తాగడం వల్ల మొటిమలు తగ్గుతాయి. సరైన పోషకాహారంతో ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.

February 27, 2026 / 12:20 PM IST

చప్పట్లతో వెన్ను నొప్పికి చెక్..!

సాధారణంగా ఎవరినైనా అభినందించడానికి, ప్రోత్సహించడానికి చప్పట్లు కొడతాం. కానీ, చప్పట్లు కొట్టడం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. దీన్నే క్లాపింగ్ థెరపీ అని కూడా అంటారు. చప్పట్లతో శరీర భాగాలకు సంబంధించిన ఆక్యుప్రెషర్ పాయింట్లు యాక్టివేట్ అవుతాయి. దీంతో వెన్ను నొప్పి, ఒత్తిడి, ఆందోళ, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

February 27, 2026 / 11:59 AM IST

అవిసె గింజ‌ల‌తో ఆరోగ్య ప్రయోజనాలు

అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అధికంగా ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరిచి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. రక్తపోటును నియంత్రించడంలోనూ ఇవి కీలకం. వీటిని పొడి రూపంలో రోజూ తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు ప్రకాశవంతంగా మారుతాయి.

February 27, 2026 / 10:13 AM IST

ఉదయాన్నే దానిమ్మ జ్యూస్ తాగుతున్నారా?

దానిమ్మ పండు పోషకాల గని. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో దీని రసం తాగితే జీర్ణక్రియ మెరుగుపడి, శరీరం డిటాక్స్ అవుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇది రక్తపోటును నియంత్రిస్తూ గుండె ఆరోగ్యానికి, మెరిసే చర్మానికి మేలు చేస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే శక్తి కూడా దీనికి ఉంది.

February 27, 2026 / 09:28 AM IST

వాట్సాప్ యూజర్లకు కేంద్రం బిగ్ అలర్ట్

వాట్సాప్ యూజర్లకు కేంద్రం బిగ్ అలర్ట్ ఇచ్చింది. ‘సిమ్ బైండింగ్’ నియమాలను అమలు చేయడానికి రేపటి వరకే గడువు ఇచ్చింది. కొత్త నిబంధనల మేరకు మీ ఫోన్‌లో సిమ్ కార్డు లేకపోతే వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్‌చాట్, షేర్‌చాట్, జియోచాట్, తదితర మెసేజింగ్ యాప్‌లు పనిచేయవు. మీరు మీ కంప్యూటర్‌లో వాట్సాప్‌లోకి లాగిన్ అయితే 6 గంటల్లోపు లాగ్ అవుట్ అవుతుంది.

February 27, 2026 / 08:35 AM IST

సింహాసనం వల్ల కలిగే ఉపయోగాలు

సింహాసనం(సింహ భంగిమ) యోగా అభ్యాసం వల్ల ముఖం, గొంతు, ఛాతీ కండరాలు ఉత్తేజితమై, ఒత్తిడి, కోపం తగ్గుతాయి. ముఖం, దవడ, గొంతు కండరాలను బలోపేతం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. అంతర్గత బలం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. వెన్నెముక, పెల్విస్, చీలమండలను సాగదీయడం ద్వారా శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా ఉంచుతుంది.

February 27, 2026 / 07:11 AM IST

15 శాతం మందికి స్నేహితులే లేరు!

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ వ్యసనం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్ షిప్ రిసెషన్ ఏర్పడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో వందలాదిగా ఉన్న స్నేహితులు నేడు ఒక్కరికి పరిమితమయ్యారు. దేశంలో 15% మందికి అసలు స్నేహితులే లేకపోవడం ఆందోళనకరం. ఈ ఒంటరితనం తీవ్రమైన డిప్రెషన్‌కు దారితీస్తోంది. సోషల్ మీడియాలో కాకుండా నిజజీవితంలో స్నేహాలను పెంచుకోవడం మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం.

February 26, 2026 / 10:25 PM IST

రాత్రిపూట టిఫిన్ చేస్తున్నారా..?

రాత్రిపూట అన్నం మానేసి టిఫిన్ తినడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. అయితే టిఫిన్ రకాన్ని బట్టి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇడ్లీ, ఉప్మా వంటివి త్వరగా జీర్ణమై శరీరానికి హాయినిస్తాయి. కానీ, నూనెలో వేయించిన పదార్థాలతో ఎసిడిటీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రాత్రిపూట జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటుంది కాబట్టి పడుకోవడానికి కనీసం 2 గంటల ముందే తేలికపాటి టిఫిన్‌తో ముగించడం మంచిది.

February 26, 2026 / 09:34 PM IST

పుదీనా ఆకుతో అద్భుత ప్రయోజనాలు

పుదీనా ఆకు కేవలం సువాసనకే కాదు, ఆరోగ్యానికి ఒక వరం. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తూ తలనొప్పి, ఉబ్బసం, వికారం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. శ్వాసకోశ ఇబ్బందులను తగ్గించి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నోటి దుర్వాసనను దూరం చేయడంతో పాటు జ్ఞాపకశక్తిని పెంచి, ఒత్తిడిని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా పుదీనా ఒక ఉత్తమ ఔషధంగా పనిచేస్తుంది. 

February 26, 2026 / 05:15 PM IST

తగ్గుతున్న ఫ్రెండ్స్.. ఎందుకంటే?

స్నేహితులు తగ్గిపోతున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. బిజీ లైఫ్ స్టైల్, స్మార్ట్ ఫోన్ అడిక్షన్‌తో ఫ్రెండ్ షిప్ ఆన్‌లైన్‌కే పరిమితమైంది. 1960ల్లో ఒక్కొక్కరికీ వందమంది స్నేహితులుంటే 1990 ప్రాంతంలో ఐదుగురికి, ప్రస్తుతం ఒక్కరికి పడిపోయింది. దేశంలో 15శాతం మందికి అసలు ఫ్రెండ్సే లేరు. దీనిని ‘ఫ్రెండ్ షిప్ రిసెషన్’ అంటారు. మరి మీకు ఫ్రెండ్స్ ఉన్నారా?

February 26, 2026 / 03:15 PM IST

మధ్యాహ్నం భోజనం తర్వాత ఇలా చేయండి..!

మధ్యాహ్నం వేళ ఉత్సాహంగా ఉండటానికి ఈ ఆరోగ్య సూత్రాలు పాటించండి. భోజనం చేసిన వెంటనే నిద్రపోకుండా కాసేపు నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. భోజనానికి, నీటి వినియోగానికి మధ్య 30 నిమిషాల వ్యవధి ఉంచండి. ఎక్కువగా నూనె, మసాలా ఉన్న ఆహారం కంటే ఆకుకూరలు, పెరుగు తీసుకోవడం ఉత్తమం. ఇది మధ్యాహ్నం వచ్చే నీరసాన్ని తగ్గించి, మిమ్మల్ని రోజంతా చురుగ్గా ఉంచుతుంది.

February 26, 2026 / 02:30 PM IST

మధ్యాహ్నం పెరుగు తింటున్నారా?

మధ్యాహ్న భోజనంలో పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరిచి, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. ఎండ వేడి నుంచి శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, కాల్షియం శరీరానికి అంది ఎముకలు బలంగా ఉంటాయి. ఇది కడుపు నిండిన భావనను కలిగించి అతిగా తినకుండా చేస్తుంది. అయితే జలుబు లేదా దగ్గు ఉన్నప్పుడు మాత్రం పెరుగుకు దూరంగా ఉండటం మంచిది. 

February 26, 2026 / 02:12 PM IST

పూలతో ముఖానికి మెరిసే అందం

సహజమైన పూలతో చర్మ సౌందర్యాన్ని సులభంగా పెంచుకోవచ్చు. కలువ రేకులు, పాలు కలిపిన పేస్ట్ ముడతలను తగ్గిస్తుంది. గులాబీ రేకలు, శనగపిండి మిశ్రమం ముఖానికి మంచి మెరుపును ఇస్తుంది. మల్లెపూల పేస్ట్‌తో మర్దనా చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. రసాయనాలకు దూరంగా ఉంటూ, ఈ పూల చిట్కాలతో ముఖాన్ని తాజాగా, కాంతివంతంగా మార్చుకోవచ్చు. ప్రకృతి సిద్ధమైన ఈ పద్ధతులు చర్మానికి సురక్షితం.

February 26, 2026 / 11:50 AM IST

గంటకోసారి లేవండి.. గుండెను కాపాడుకోండి

నేటి యాంత్రిక జీవనంలో గంటల తరబడి కూర్చొని పని చేయడం ప్రాణాంతకమవుతోంది. ఎక్కువ సేపు కూర్చోవడంతో కదలిక లేకపోవడం వల్ల రక్తప్రసరణ మందగించి గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. అందుకే ఎంత పని ఉన్నా గంటకోసారి సీటు నుంచి లేచి, కనీసం 2 నిమిషాలు నడవాలి. ఈ చిన్న అలవాటు రక్తప్రసరణను మెరుగుపరిచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు శారీరక శ్రమను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

February 26, 2026 / 10:54 AM IST

విదుర నీతి: ఈ ఇద్దరూ సూర్యుడిలా ప్రకాశిస్తారు

ఈ లోకంలో ఇద్దరు వ్యక్తులు సూర్యుడిలా ప్రకాశిస్తారని విదురుడు ధృతరాష్ట్రుడికి వివరించాడు. ‘ఎదుటివారిని శిక్షించే సామర్థ్యం ఉండి కూడా, కోపాన్ని అణచుకుని క్షమించే వ్యక్తి. అలాగే తన దగ్గర చాలా తక్కువ వనరులు ఉన్నా, ఇతరుల కష్టాన్ని చూసి చలించి తనకున్న దానిలోనే దానం చేసే పేదవాడు. ఈ ఇద్దరికీ దైవత్వం సిద్ధిస్తుంది, సమాజం వీరిని ఎప్పటికీ స్మరించుకుంటుంది’ అని విదురుడు చెప్పాడు.

February 26, 2026 / 08:00 AM IST