Holi festival: హోలీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!
హోలీ పండుగ ఆడాలంటే చాలా మంది భయపడుతుంటారు. ఎందుకంటే చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు వస్తాయని ఆలోచిస్తారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే హోలీ సరదాగా గడపొచ్చు, అదేంటో చూద్దాం.
Holi festival: హోలీ పండగ వచ్చేస్తోంది. ఈ పండగ రోజున సరదాగా రంగులతో ఆడుకోవాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. కానీ.. ఆడిన తర్వాత వచ్చే చర్మ సమస్యలు, జుట్టు సమస్యలకు అందరూ భయపడుతూ ఉంటారు. అయితే.. ఆ సమస్యలు రాకుండా ఉండేందుకు ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఓసారి చూద్దాం…
హోలీ ఆడటానికి ముందు:
మాయిశ్చరైజర్: చేతులు, పాదాలు, ముఖానికి మంచి మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనె రాసుకోండి.
సన్‌స్క్రీన్: కనీసం SPF 30 ఉన్న సన్‌స్క్రీన్‌ను రాయండి.
దుస్తులు: ఫుల్ స్లీవ్స్ ధరించండి, సన్ గ్లాసెస్, స్కార్ఫ్ ఉపయోగించండి.
జుట్టు: జుట్టును కవర్ చేసుకోండి.
నెయిల్ పాలిష్: నెయిల్ పాలిష్ వేయండి.
రంగులు: పండ్లు, కూరగాయలు, ఆకులతో చేసిన రంగులు వాడండి.
పదార్థాలు: రంగుల పదార్థాలను చెక్ చేయండి.
స్నానం: గోరువెచ్చని నీటితో స్నానం చేయండి.
స్క్రబ్ చేయవద్దు: రంగును వదిలించుకోవడానికి స్క్రబ్ చేయవద్దు.
మాయిశ్చరైజర్: డ్రై స్కిన్ ఉన్నవారు స్నానం తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
ముఖానికి రసాయనాలు వద్దు: రెటినోల్, గ్లైకోలిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్ లేదా విటమిన్ సి వాడవద్దు.
చికాకు: చర్మం చికాకుగా ఉంటే కొబ్బరి నూనె రాసుకోండి. దురద తగ్గకపోతే వేపాకు నీటితో స్నానం చేయండి.
ఇతర జాగ్రత్తలు..
హోలీ రంగులను తొలగించడానికి హెయిర్ కండీషనర్ ఉపయోగించవచ్చు.
చర్మానికి హాని కలిగించే రసాయన రంగులను నివారించండి.
పుష్కలంగా నీరు త్రాగండి.
హోలీ ఆట తర్వాత మీ చర్మాన్ని శుభ్రంగా , తేమగా ఉంచడానికి శ్రద్ధ వహించండి.
రంగులు కళ్లలో పడకుండా జాగ్రత్త వహించండి.
పెదాలకు లిప్ బామ్ రాసుకోండి.
హోలీ ఆట ముగిసిన తర్వాత మీ దుస్తులు మరియు బట్టలను వెంటనే శుభ్రం చేసుకోండి.
హోలీ ఆట తర్వాత మీ చర్మం , జుట్టును శుభ్రం చేసుకోవడానికి సహజ ఉత్పత్తులను ఉపయోగించండి. ఈ చిట్కాలను పాటించడం వల్ల హోలీ ఆట ఆనందించడంతో పాటు మీ చర్మం , జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.