How To Rid skin tags Naturally : కొంత మందికి ముఖం, మెడ, శరీర భాగాలపై ఎక్కువగా పులిపిరి కాయలు వస్తుంటాయి. ఇవి అంత ప్రమాదకరం కానప్పటికీ చూసేందుకు ఇబ్బందిగా ఉంటాయి. అందువల్ల వాటిని తీయించుకునేందుకు ఆసుపత్రులకు వెళుతుంటారు. కొంత మందికి ఈ సమస్య మరీ ఎక్కువగానూ ఉంటూ ఉంటుంది. అయితే ఇంట్లో ఉండే కొన్ని పదార్థాల ద్వారా వీటికి తేలికగా చెక్ పెట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. మరి ఆ పద్ధతులేంటో తెలుసుకుని అవసరమైన వారు ప్రయత్నించి చూసేయండి.
సాధారణంగా ఏర్పడే పులిపిరి కాయలు(skin tags) హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్‌పీవీ)(human papilloma virus (HPV)) వల్ల వస్తాయి. ఈ వైరస్ మానవ శరీరంలోకి చేరిన తర్వాత కొన్ని కొన్ని ప్రాంతాల్లో అదనంగా కణాలు ఉత్పన్నం అయ్యేందుకు ప్రోత్సహిస్తుంది. దీంతో అక్కడ కణాలు వృద్ధి చెంది పులిపిరి కాయలు మాదిరిగా పైకి వస్తాయి. కొంత మందిలో ఇవి చిన్న చిన్నగా వస్తే మరి కొందరికి పెద్ద పెద్దగా వస్తుంటాయి. ఇలాంటి వాటికి కొన్ని ఇంటి వైద్యాలు ఉన్నాయి.
* యాపిల్ సైడర్ వెనిగర్‌ని ఉదయం సాయంత్రం పులిపిర్ల(skin tags) మీద రాయడం వల్ల అవి కొన్ని రోజులకు తగ్గిపోతాయి.
* పైనాపిల్ రసాన్ని రోజూ వీటి మీద రాయడం వల్ల ఫలితం ఉంటుంది.
* ఉల్లి రసాన్ని తీసుకుని రోజూ పులిపిర్లపై రాయడం వల్ల అవి రాలిపోతాయి.
* మన అందరి ఇళ్లల్లోనూ అల్లం ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. దాన్ని పేస్ట్‌లా చేసి పులిపిర్ల మీద పెట్టుకుంటూ ఉండాలి. కొన్ని రోజుల పాటు ఇలా చేయడం వల్ల అవి రాలిపోతాయి. జర్నల్ ఆఫ్ కాంప్లిమెంటరీ అండ్ ఇంటిగ్రేటివ్ మెడిసన్‌లో ఈ విషయం 2022లో ప్రచురితం అయ్యింది. అల్లం పేస్ట్‌ని రోజుకు రెండు సార్లు పులిపిర్ల మీద రాసుకుంటే వాటి పరిమాణం, సంఖ్య చెప్పుకోదగ్గ రీతిలో తగ్గిందని పరిశోధకులు వెల్లడించారు.
* వీటి మీద నిమ్మరసాన్ని రాసుకుంటూ ఉంటే అవి తేలికగా రాలిపోతాయి.