కొంత మందికి మెడ వెనక భాగం నల్లగా మారుతుంటుంది. అయితే దాన్ని అంత తేలికగా తీసుకోకూడదు. కొన్ని వ్యాధులకు అది సూచన కావొచ్చు. వాటిపై మనం అవగాహనతో ఉండాల్సిన అవకాశం ఎంతైనా ఉంది.
Black Neck reasons : మెడ వెనక భాగం కొంత మందికి నల్లగా మారుతూ ఉంటుంది. శరీరంలోని కొన్ని వ్యాధుల వల్ల అది అలా అయ్యేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు మెడ ఇలా నల్లగా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మధుమేహం ఉన్న వారికి మెడ నల్లగా మారే అవకాశాలు ఉంటాయి. వీరికి ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కాదు. అందుకనే వీరికి డయాబెటిస్ వస్తుంది. ఇలాంటి వారిలో మెడపై నల్లటి చారలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే వీటిని గమనిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. ఇలా మెడ నల్లగా మారడాన్ని వైద్య పరిభాషలో అకాంథోసిస్ నైగ్రికన్స్ అంటారు.
కొంత మందికి హైపో థైరాయిడిజం లాంటివి ఉంటాయి. వీరికి థైరాయిడ్ గ్రంథి తగినంత హార్మోన్‌ని విడుదల చేయదు. అందువల్ల మెడ నల్లబడొచ్చు. అలాంటి లక్షణాలు కనిపించినప్పుడు థైరాయిడ్, షుగర్ టెస్టులు చేయించుకోవాలి. అలాగే మహిళల్లో పీసీఓడీ, ఓవేరియన్ సిస్ట్లు ఉంటే కూడా ఈ సమస్య తలెత్తవచ్చు. ఇంకా ఊబకాయం ఉన్న వారిలోనూ ఈ సమస్య కనిపించవచ్చు. ఇదేదో మామూలు నలుపే అనుకుని వదిలేస్తే లోపల ఈ సమస్యలు ఇంకా పెరిగిపోవచ్చు. కాబట్టి సూచన కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించి టెస్టులు చేయించుకోవాలి. అవసరమైన చికిత్సలు తీసుకోవాలి.