ఈ రోజుల్లో ఎక్కువ మందికి గుండె జబ్బులు( Heart Diseases) వస్తున్నాయి. ముఖ్యంగా యువతలో కొందరు చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్(Heart attack)తో ప్రాణాలు వదులుతున్నారు. జీవనశైలి, ఆహార నియమాల వల్ల ఆరోగ్యం తీవ్రంగా నాశనమవుతోంది. అందుకే ముందు నుంచి జాగ్రత్తలు తీసుకుంటే గుండె జబ్బుల( Heart Diseases)ను నివారించొచ్చు.
ఈ రోజుల్లో ఎక్కువ మందికి గుండె జబ్బులు( Heart Diseases) వస్తున్నాయి. ముఖ్యంగా యువతలో కొందరు చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్(Heart attack)తో ప్రాణాలు వదులుతున్నారు. జీవనశైలి, ఆహార నియమాల వల్ల ఆరోగ్యం తీవ్రంగా నాశనమవుతోంది. అందుకే ముందు నుంచి జాగ్రత్తలు తీసుకుంటే గుండె జబ్బుల( Heart Diseases)ను నివారించొచ్చు. కానీ చాలా మంది గుండె ఆరోగ్యం(Heart Health) విషయంలో అశ్రద్ధవహిస్తూ ఉంటారు. మరికొందరు సమస్య వస్తేనే స్పందిస్తూ ఉంటారు. ఇలా కాకుండా గుండె ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అందరిపై ఉంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరూ తమ హెల్త్ రిస్క్ గురించి తెలుసుకుంటూ ఉండాలి. ప్రస్తుత కాలంలో గుండె జబ్బు( Heart Diseases)లకు వయసుతో సంబంధం లేకుండా పోతోంది. 20-30 ఏళ్లలోని వారు కూడా హార్ట్ ఎటాక్(Heart attack)తో చనిపోయిన సందర్భాలున్నాయి. గర్భిణులకు వచ్చే ముఖ్యమైన సమస్యల్లో గుండె జబ్బు కూడా ఒకటని గుర్తించాలి. అందుకని రెండు మూడేళ్లకోసారి అయినా అన్ని రకాల పరీక్షలు చేయించుకుంటే చాలా మంచిది. దీనివల్ల కొలెస్ట్రాల్, బీపీ, మధుమేహం తదితర సమస్యలు గురించి తెలుసుకుని వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు.
మన శరీరంలో ప్రతీ భాగంలోని ప్రతి కణానికి రక్తం అందాలంటే గుండె(Heart) నిర్ణీత ఒత్తిడితో దాన్ని పంప్ చేస్తూ ఉంటుందని అందరికీ తెలుసు. అయితే కొన్ని రకాల కారణాలతో ఈ ఒత్తిడి పెరిగిపోతే దాన్ని అధిక రక్తపోటు, హైపర్ టెన్షన్ గా వైద్యులు చెబుతూ ఉంటారు. ఇలా అధిక రక్తపోటు దీర్ఘకాలం పాటు కొనసాగితే అది గుండెతోపాటు మూత్రపిండాలు సహా ఇతర ముఖ్యమైన అవయవాలకు నష్టం కలిగిస్తుంది. అంతేకాదు కొన్ని అనారోగ్య సమస్య(Health issues)లను తెచ్చిపెడుతుంది. అందుకే వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి.
గుండె జబ్బుల రిస్క్ ఉందని ముందుగానే తెలుసుకోవడానికి మన కుటుంబ ఆరోగ్య చరిత్ర అనేది ముఖ్యం. తల్లిదండ్రులు, వారి తోడబుట్టిన వారు, మేనమామలు, మేనత్తలను అడిగి వారికి గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవాలి. గుండె పోటు(Heart attack) రావడం, స్ట్రోక్, మూత్ర పిండాల వైఫల్యం వంటి వాటి గురించి అడిగి తెలుసుకోవాలి. మీకు తరచూ ఛాతీలో నొప్పి వస్తూ ఉంటే దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. అలా అని ఛాతీ భాగంలో వచ్చే ప్రతి నొప్పి కూడా గుండె(Heart)కు సంబంధం ఉందనుకోకండి. ఛాతీలో తీవ్ర అసౌకర్యం, భారం, బరువు మోపినట్టు అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి. అలాగే అజీర్ణం, నొప్పి మెడ భాగం నుంచి చేతిలోకి పాకుతుండడం, గుండె దడ, తలతిరగడం, సొమ్మసిల్లి పడిపోవడం ఇవన్నీ కూడా గుండెకు సంబంధించినవేనని గుర్తించాలి. ఉన్నట్టుండి చెమటలు పట్టేయడం, తలతిరగడం, ఛాతీలో భరించలేనంత నొప్పి కూడా గుండె పోటు లక్షణాలేనని తెలుసుకోని వెంటనే వైద్యులను సంప్రదించండి.
గుండె జబ్బులు( Heart Diseases) రాకుండా ఉండాలంటే ముఖ్యంగా నిద్ర(Sleep)కు ప్రాముఖ్యత ఇవ్వాల్సి ఉంటుంది. రోజూ 8 గంటలకు ఎక్కువగానే నిద్రపోవడం ఉత్తమం. స్లీప్ ఆప్నియా సమస్య ఉంటే నిద్ర సరిగా పట్టదు. అటువంటి వారికే గుండె జబ్బు( Heart Diseases)ల రిస్కు అనేది ఎక్కువగా ఉంటుంది. గురక పెడుతున్నా సరే అటువంటివారు కార్డియాలజిస్ట్ ను సంప్రదించడం మంచిది. పొగతాగే అలవాటు ఉంటే మానుకోవడం మంచిది. మద్యపానం కూడా గుండె జబ్బులకు కారకం అవుతుంది. అలాగే ఒత్తిడి లేకుండా నవ్వుతూ ఉంటే గుండె జబ్బులు మీ దరికి చేరవు.