వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది:
వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు సాయపడతాయి.
అల్లిసిన్ అనే సమ్మేళనం కూడా ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్స్ నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.
వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీంతో ఫ్రీ రాడికల్స్ నుండి శరీర కణాలను దెబ్బతినకుండా కాపాడి ఇమ్యూనిటీని పెంచుతాయి.
జలుబు, దగ్గు నుండి ఉపశమనం:
చలికాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలతో చిన్నపిల్లలే కాకుండా పెద్దలు కూడా బాధపడుతుంటారు.
అలాంటి వారు రెగ్యులర్గా వెల్లుల్లిని తినాలి.
వెల్లుల్లిని పచ్చళ్ళు, కూరల్లో కలపి తింటే ఇమ్యూనిటీ పెరిగి జలుబు దూరమవుతుంది.
శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది:
వెల్లుల్లిలో వేడి పుట్టించే గుణాలు ఉన్నాయి.
ఇవి శరీర ఉష్ణోగ్రతని పెంచి చలిని తగ్గిస్తుంది.
వెల్లులి తీసుకుంటే రక్త ప్రసరణ పెరుగుతుంది.
ఇది చేతులు, కాళ్ళకి వెచ్చదనాన్ని అందించి జలుబు నుండి ఉపశమనం అందుతుంది.
గుండె ఆరోగ్యానికి మంచిది:
చలికాలంలో వెల్లుల్లి రసం తీసుకుంటే వ్యాధులని తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
రక్తపోటుని తగ్గిస్తుంది.
కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది.
చలికాలంలో గుండెపోటు, ఇతర సమస్యలు దూరమవుతాయి.
మొత్తం మీద చలికాలంలో వెల్లుల్లి ఒక అద్భుతమైన ఔషధం.
వెల్లుల్లిని ఎలా తీసుకోవాలి:
పచ్చిగా తినవచ్చు.
రసం తీసుకోవచ్చు.
వంటల్లో వాడవచ్చు.