ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్(junior NTR). ఈ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టాడు. అందుకోసం.. సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నాడట తారక్. అయితే యంగ్ టైగర్ బాడీ బిల్డింగ్ ఏ సినిమా కోసమనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.
దగ్గుబాటి ఫ్యామిలీలో వెంకటేష్ తర్వాత రానా హీరోగా రానిస్తున్నాడు. బాహుబలి వంటి సినిమాతో రానాకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కింది. బాబాయ్, అబ్బాయ్ కలిసి 'రానా నాయుడు' అనే బోల్డ్ వెబ్ సిరీస్ కూడా చేశారు. ఇక వీళ్ల దారిలోనే హీరోగా రాణించేందుకు ట్రై చేస్తున్నాడు అభిరాం(daggubati abhiram). కానీ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్టు తెలుస్తోంది.
గత కొన్ని రోజుల నుంచి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి ఆగిపోయిందనే రూమర్ వైరల్ అవుతోంది. తాజాగా తమ పెళ్లిపై హీరో వరుణ్ తేజ్ క్లారిటీ ఇచ్చాడు. గాండీవధారి అర్జున మూవీ ప్రమోషన్లలో భాగంగా తన ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా సినిమాల్లో.. పుష్ప2 కూడా ఒకటి. పుష్ప సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టారు సుకుమార్ ఈసారి అస్సలు తగ్గేలేదే అంటున్నారు. ప్రస్తుతం పుష్పరాజ్, షెకావత్ సార్ మధ్య అదిరిపోయే సీన్స్ షూట్ చేస్తున్నాడట సుకుమార్.
ఉప్పెన సినిమాతో ఉప్పెనలా ఎగిసిడిన యంగ్ బ్యూటీ కృతి శెట్టి.. అదే స్పీడ్‌లో కిందకు పడిపోయింది. ఒక్క సినిమాతో హాట్ కేక్‌లా మారిపోయిన కృతిశెట్టి కెరీర్ ఇప్పుడు డైలామాలో పడిపోయింది. అసలు లైమ్‌లైట్లో లేకుండానే పోయింది కృతిపాప. ఇలాంటి సమయంలో కృతి(Krithi Shetty) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
యంగ్ హీరో నాగశౌర్య(Naga Shourya) యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela)పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అసలెందుకు నాగశౌర్య, శ్రీలీల పై కామెంట్స్ చేశాడు. ఈ ఇద్దరు కలిసి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. మరి ఈ యంగ్‌స్టర్స్‌కు ఉన్న కనెక్షన్ ఏంటి?
సోషల్ మీడియా పుణ్యమా అని వేణు స్వామి(Venu Swamy) చాలా ఫేమస్ అయిపోయాడు. స్టార్ సెలబ్రిటీస్ పై ఈయన చేసే కామెంట్స్ ఎప్పుడూ వైరల్ అవుతునే ఉంటాయి. ముఖ్యంగా ఫలానా జంట విడిపోతుంది.. కలిసి ఉండలేరు.. విడాకులు తీసుకుంటారు అని చెబుతుంటాడు. తాజాగా మరో టాలీవుడ్ కొత్త జంట కూడా విడిపోతుందని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.
రీసెంట్‌గా కన్నడ స్టార్ హీరో(kannada Hero) ఉపేంద్ర(Upendra) చేసిన వ్యాఖ్యలు వివాదం అయిన సంగతి తెలిసిందే. ఉపేంద్ర చేసిన కామెంట్స్ కన్నడలో కొన్ని వర్గాల వారిని ఉద్దేశించి ఉండడంతో.. పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. దాంతో ఇప్పుడు ఉన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించాడు ఉపేంద్ర.
ఆగస్టు 15న ఖుఫీ మూవీ మ్యూజికల్ కాన్సెర్ట్ జరిగింది. ఈ వేడుకలో భాగంగా హీరోయిన్ సమంత, హీరో విజయ్ దేవరకొండ స్టేజ్‌పై లైవ్ పర్ఫార్మెన్స్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. హద్దులు దాటి డ్యాన్స్ చేశారని ట్రోల్స్ చేస్తున్నారు.
తన నెక్ట్స్ మూవీ ధీరలో పూజా హెగ్డే హీరోయిన్ కావాలని అక్కినేని అఖిల్ పట్టు బడుతున్నాడు. బుట్ట బొమ్మ నటిస్తే మినిమం గ్యారంటీ ఉంటుందని.. మూవీ సక్సెస్ అవుతుందని భావిస్తున్నాడు.
ముంబైకి మకాం మార్చినట్లు వస్తున్న వార్తలపై హీరో సూర్య క్లారిటీ ఇచ్చాడు. ఫ్యాన్స్ మీట్‌లో పాల్గొన్న సూర్య అందరి సమక్షంలో నిజం చెప్పారు. అక్కడ తనకు ఇళ్లు ఉన్నది వాస్తవమేనని స్పష్టం చేశారు. అయితే అక్కడ ఉండేది సూర్య కాదట.
సూర్య(suriya sivakumar) కాదు.. విక్రమ్ సినిమా తర్వాత రోలెక్స్ అంటూ రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్. విక్రమ్ సినిమాలో కనిపించింది కొద్ది సేపే కానీ.. ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ సినిమా పై కాసుల వర్షం కురిపించేలా చేసింది. క్లైమాక్స్‌లో గూస్ బంప్స్ తెప్పించిన రోలెక్స్(rolex) ఇప్పుడు.. ఫుల్ లెంగ్త్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. రెండున్నర రోజుల్లోనే అన్ని సెంటర్స్‌లో బ్రేక్ ఈవెన్ అయిన జైలర్ మూవీ.. మూడు రోజుల్లో రూ.200 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది. ఇక సండే సాలిడ్ బుకింగ్స్‌తో 300 కోట్లు కొల్లగొట్టింది. అంతేకాదు మధ్యలో మండేని వదిలిపెడితే.. నెక్స్ట్ డే ఆగష్టు 15 హాలిడే అవడంతో.. రూ.400 కోట్లు కొల్ల గొట్టడం ఖాయమంటున్నారు. ఇదే జోష్‌లో జైలర్ సీక్వెల్ కూడా ఫిక్స్ చేశాడు డైరెక్...
విశ్వక్ సేన్(Vishwak Sen) అంటేనే.. వివాదాలు ఎక్కువగా గుర్తొస్తాయి. సినిమా కోసం ఈ యంగ్ హీరో ఎంతవరకైనా వెళ్తాడని.. ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తునే ఉన్నాడు. అందుకే తనతోటి హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విశ్వక్ కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఇలాంటి సమయంలో పెళ్లి పీఠలెక్కబోతున్నానని షాక్ ఇచ్చాడు మాస్ కా దాస్.
ఎవరో ఎందుకు.. తన తోటి హీరో తనకు పోటీ హీరో బాలకృష్ణనే తీసుకుంటే.. వరుసగా స్ట్రెయిట్ సినిమాలు చేస్తున్నాడు. కానీ మెగాస్టార్(megastar chiranjeevi) మాత్రం రిస్క్ ఎందుకులే అని రీమేక్ సినిమాలు చేస్తున్నారు. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ ఎప్పటి కప్పుడు నిరాశకు గురి అవుతునే ఉన్నారు. తాజాగా భోళా శంకర్(bhola shankar) రిజల్ట్ చూసిన తర్వాత మెగాభిమానులు ఓపెన్ లెటర్స్ రాస్తున్నారు.