యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ(Varsha Bollamma) కర్ణాటకలోని కూర్గ్‌లో పుట్టి బెంగళూరులో పెరిగింది. మొదట తమిళ చిత్రం సతురన్ (2015)తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత యానుమ్ తీయవన్ (2017), కళ్యాణం (2018), సీమతురై (2018), బిగిల్ (2019) వంటి సినిమాల్లో పలు క్యారెక్టర్లు చేసింది. ఇక తెలుగులో 2020లో వచ్చిన చూసి చూడంగానే, జాను, మిడిల్ క్లాస్ మెలోడీస్ వంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత పుష్పక విమానం(2021), స్టాండప్ రాహుల్(2022), స్వాతి ముత్యం(2022) మూవీల్లో యాక్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసిన కొన్ని చిత్రాలను ఇప్పుడు చుద్దాం.