హీరో నాని నటించిన పైసా సినిమా(Paisa movie)తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సిద్ధికా శర్మ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే ఈభామ.. తాజా ఫోటోలను అభిమానులతో పంచుకుంటోంది. ఇప్పుడు ఈఅమ్మడు లేటెస్ట్ ఫోటోస్ నెట్టింట్ట కాకరేపుతున్నాయి.
1991 డిసెంబరు 19న ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలోని డెహ్రాడూన్లో సిద్ధికా శర్మ జన్మించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సిద్ధికా డిగ్రీ పూర్తి చేశారు. ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేశారు.
గల్లీ కుర్రోళ్ళు, పైసా, ప్రేమ పరిచయం, నిన్నే పెళ్ళాడతా, వెల్లపంటి లాంటి సినిమాలలో సిద్ధికా శర్మ(Siddika Sharma) నటించారు. తెలుగుతో పాటు పంజాబీ, హిందీ చిత్రాల్లో కూడా ఆమె నటించారు.
సినిమాల మీద ఉన్న ఇష్టంతో సిద్ధికా శర్మ మోడల్(Model)గా కెరీర్ ప్రారంభించారు. ‘ఆల్ ది బెస్ట్’ చిత్రంతో సిద్ధికా సినీ రంగంలోకి అడుగు పెట్టారు.
సిద్ధికా పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.