దక్షిణాది ప్రేక్షకుల హృదయాలను దొచుకున్న అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే. అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు.. తమిళం, హిందీ సినిమాల్లో నటించి మెప్పించింది.
టాలీవుడ్ (Tollywood) బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) ప్రస్తుతం బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన కేసి కా భాయ్ కేసి కా జాన్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పూజా.. అరేంజ్ డ్రెస్లో పరువాలు ఒలికిస్తూ ఆడియన్స్ చేత ఓరేంజ్ అనిపించుకుంటుంది.
తక్కువ సమయంలోనే భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. అగ్ర హీరోల సరసన స్క్రీన్ షేర్ చేసుకుని.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉండిపోయింది. ఇటీవల రాధేశ్యామ్, ఆచార్య సినిమా(Acharya movie)లతో ఆడియన్స్ ముందుకు వచ్చిన పూజా…
వరుస డిజాస్టర్స్ ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది ఈ ముద్దుగుమ్మ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి.. అయినా ఇండస్ట్రీలో మా త్రం ఈ అమ్మడు క్రేజ్ తగ్గట్లేదు.
పూజా హెగ్డేకు దక్షిణాదిలో మాత్రం ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో పూరీ, విజయ్ కాంబోలో రాబోతున్న జనగణమన ప్రాజెక్ట్ ఉండగా.. మరోవైపు మహేష్.. త్రివిక్రమ్(Trivikram) కాంబోలో రాబోతున్న సినిమాలోనూ నటిస్తోంది.
ఇక ఈ అమ్మడు రెమ్యునరేషన్ (Remuneration) కూడా గట్టిగానే డిమాండ్ చేస్తోంది అని వార్తలు వచ్చాయి .ఈ మధ్య కాలంలో గ్లామర్ హీరోయిన్ పూజ హెగ్డే (Pooja Hegde) చేసిన సినిమాలు అన్ని బాక్సాఫిస్ దగ్గర ప్రేక్షకులను నిరాశ పరిచాయి .
ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తో చేసిన రాధే శ్యామ్, సినిమా దళపతి విజయ్ తో చేసిన బీస్ట్ ,సినిమా రామ్ చరణ్ సరసన నటించిన ఆచార్య సినిమా ఇలా వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే .