ఎలిఫెంట్ విస్సరర్స్ నటులు బొమన్, బెల్లిని ప్రధాని నరేంద్ర మోడీ తెప్పకడు ఎలిఫెంట్ క్యాంపులో ఆదివారం కలిశారు. వారితో కలిసి దిగిన ఫోటోలను మోడీ (modi) ఫేస్బుక్లో షేర్ చేశారు.
Elephant Whisperers couple:ఎలిఫెంట్ విస్సరర్స్ (Elephant Whisperers) నటులు బొమన్, బెల్లిని ప్రధాని నరేంద్ర మోడీ (modi) తెప్పకడు ఎలిఫెంట్ క్యాంపులో ఆదివారం కలిశారు.
ముదుమలై టైగర్ రిజర్వ్‌లో గల తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్ ఉంది. బొమ్మన్, బెల్లిని ప్రధాని మోడీ కలువడంతో పాటు అక్కడ ఉన్న ఏనుగు రఘును తాకారు. బొమ్మన్, బెల్లి కలిసి నటించిన డాక్యుమెంటరీ ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే.
ఎలిఫెంట్ విస్పరర్స్ (Elephant Whisperers) మూవీ బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ఆ సినిమాలో ఏనుగు ‘రఘు’తో (raghu) ఆ దంపతులకు ఉన్న అనుబంధం గురించి చక్కగా చూపించారు.
ప్రధాని మోడీ (modi) వస్తుండటంతో ఎంటీఆర్కు కొత్త లుక్ వచ్చింది. మోడీ విమానం ల్యాండ్ అయ్యేందుకు సింగరాలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న రహదారిని (road) పునరుద్దరించారు. గిరిజన ప్రాంతంలో 30 ఎలక్ట్రిక్ పోల్స్ ఏర్పాటు చేసి.. విద్యుత్ సరఫరా (power) చేస్తున్నారు. ఏనుగులు స్నానం చేసే చోటును ఆధునీకరించారు.
మోడీ (modi) వస్తుండటంతో ఎంటీఆర్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్కడ ఉన్న హోటళ్లను (hotels) తాత్కాలికంగా మూసివేశారు. ఎలిఫెంట్ సఫారీ (elephant safari), టూరిస్ట్ వెహికిల్స్ (tourist vehicles) కూడా ఈ నెల 7వ తేదీ నుంచి క్లోజ్ చేశారు.
ఎలిఫెంట్ విస్పరర్స్ మూవీలో బొమ్మన్, బెల్లి హృద్యంగా నటించారు. ఏనుగుతో తమకు ఉన్న అనబంధాన్ని చాటారు. అందుకే ఆస్కార్ అవార్డు వరించింది.