Mrunal: మృణాల్ ఠాకూర్ పరిచయం అవసరం లేని పేరు. సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించిన బ్యూటీ, ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది.
సీతారామం మూవీలో చూసి అంతా ఫిదా అయిపోయారు. అందానికీ, నటనకు దాసోహం అయిపోయారు. తమ సినిమాలో మృణాల్ ఉండాలని కోరుకుంటున్నారు.
సీతారామం పూర్తైన వెంటనే నాని సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఆ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వచ్చిన్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ హల్క్ రానా సినిమాలో కూడా మృణాల్ ని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. హీరోయిన్గా నటించిన హాయ్ నాన్న మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి పాటలు కూడా విడుదల చేశారు. అవి కూడా ఆకట్టుకున్నాయి. హాయ్ నాన్న సినిమా ఈ ఏడాది డిసెంబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
మృణాల్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది.
బ్లాక్ కలర్ డ్రెస్ లో సూపర్ హాట్‌గా కనిపిస్తోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం ఫ్యాన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
నెట్ ఫ్లిక్స్ లో లస్ట్ స్టోరీస్ 2లో నటించింది. ఇందులో లిప్ లాక్ సీన్స్ లో కూడా నటించడం విశేషం. ఆ వెబ్ సిరీస్‌లో నటనకు మంచి మార్కులు పడ్డాయి.
విజయ్ దేవర కొండ సినిమాలో నటిస్తుండటం విశేషం. ఈ మూవీకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.