»Aisha Sharma Is The Heroine Who Is Making Waves On Social Media
Aisha Sharma: సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న ఆయిషా శర్మ
మోడల్‌గా, నటీగా అలరిస్తున్న ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఆయిషా శర్మ ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానుల మతులు పోగొడుతోంది.
Aisha Sharma is the heroine who is making waves on social media
సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ.. తన హాట్ హాట్ పిక్స్‌తో కుర్రకారుకు హీట్ పెంచుతున్న బాలీవుడ్ బ్యూటీ ఆయిషా శర్మ బయోడేటాను తెలుసుకుందాం.
ప్రముఖ హీరోయిన్ నేహా శర్మ సోదరిగా పరిచయం అయిన ఈ భామ 1992, జనవరి 22న బీహార్ లోని భేగాల్ పూర్ లో జన్మించింది.
మోడల్ కెరియర్ ప్రారంభించిన ఈ అందాల సుందరి లాక్మే, పెప్సీ, క్యాంపస్ షూస్‌తో సహా అనేక ప్రసిద్ధ బ్రాండ్లకు ఆమె మోడల్ గా వ్యవహరించింది.
2016లో ఆమె కింగ్‌ఫిషర్ క్యాలెండర్ గర్ల్స్‌లో ఒకరిగా ఎంపికైంది.
ఆమె మొదట ఆయుష్మాన్ ఖురానా ఐక్ వారి (Ik Vaari) మ్యూజిక్ వీడియోలో నటించింది. ఆ తర్వాత ఆమె హిందీ యాక్షన్ థ్రిల్లర్ సత్యమేవ జయతే (2018)లో జాన్ అబ్రహం, మనోజ్ బాజ్‌పాయ్‌లతో కలిసి నటించింది.
2022లో షైనింగ్ విత్ శర్మాస్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ప్రస్తుతం పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.