Sobhita Dhulipala: నటి శోభితా ధూళిపాళ లేటెస్ట్ పిక్స్
నటి శోభితా ధూళిపాళ(Sobhita Dhulipala) 1992లో ఏపీలోని తెనాలో జన్మించింది. ఆ తర్వాత ఆమె తన పదహారేళ్ల వయసులో ముంబైకి వెళ్లింది. తర్వాత భరతనాట్యం, కూచిపూడిలో శిక్షణ తీసుకుంది. 2013లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెల్చుకుంది. ఆ తర్వాత 2016లో రామన్ రాఘవ్ 2.0 హిందీ చిత్రం ద్వారా సినిమాల్లోకి వచ్చింది. తెలుగులో 2018లో వచ్చిన గూడాచారి, 2022లో వచ్చిన మేజర్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు పీఎస్-2, సితారా, మంకీ మ్యాన్ వంటి మూవీ ప్రాజెక్టుల్లో యాక్ట్ చేస్తుంది.