Best food: ప్రపంచంలో టాప్ 5 బెస్ట్ ట్రేడిషనల్ ఫుడ్స్!
ప్రపంచంలో బెస్ట్ టాప్ 5 సాంప్రదాయ ఆహార వంటకాలను ఇప్పుడు చుద్దాం. ఆన్లైన్ ఫుడ్ గైడ్ TasteAtlas నిర్వహించిన సర్వే మేరకు పలు రకాల ఆహారాల జాతిబాను ఇక్కడ మనం చూడవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా ఆహార ప్రియులు ఎక్కువగా దేనిని ఇష్టపడుతున్నారు. ఏయే వంటకాలు ఉన్నాయి. వాటిలో భారతీయ వంటకాలు ఎన్ని చోటు దక్కించుకున్నాయి? ఎన్ని ప్రజల మెప్పు పొందాయనే విషయాలను ఇప్పుడు చుద్దాం. అంతర్జాతీయ ఆన్లైన్ ఫుడ్ గైడ్ అయిన TasteAtlas ఇటీవల 2022లో ప్రపంచంలో అత్యంత అత్యుత్తమ సాంప్రదాయ టాప్ 5 ఆహారాల జాబితాను విడుదల చేసింది. అవెంటో ఇప్పుడు చుద్దాం.
1. షాహీ పనీర్: ఈ మొఘలాయ్ వంటకం శాకాహారులు, పనీర్ ప్రియులకు చాలా ఇష్టమైన వంటకం. మృదువైన పనీర్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, బాదం, జీడిపప్పు, టొమాటోలు, మలై లేదా క్రిమ్ సహా పలు రకాల పదార్థాలతో దీనిని తయారు చేస్తారు. షాహి పనీర్ వంటకం నాన్, రోటీ లేదా పూరీలలో తరచుగా వడ్డించే మంచి గ్రేవీ వంటకం.
2. ముర్గ్ మఖానీ: ఇది ప్రపంచవ్యాప్తంగా ‘బటర్ చికెన్’గా ప్రసిద్ధి చెందింది. ఈ వంటకం ఈ జాబితాలో చోటు సంపాదించడంలో ఆశ్చర్యం లేదు. ముర్గ్ మఖానీ 1950లలో ఢిల్లీలో ఉద్భవించింది. మోతీ మహల్ ఈ రుచికరమైన వంటకానికి ఫేమస్. వండిన బొనెలెస్ చికెన్ వంటకాన్ని కొద్దిగా తీసుకుని రుచికరమైన టొమాటో గ్రేవీలో మిక్స్ చేసి తయారుచేస్తారు. దీనిని అన్నం, నాన్ లేదా రోటీతో సర్వ్ చేసుకుని భుజిస్తారు. పిల్లల నుంచి పెద్దల వరకు అనేక మంది ఈ వంటకాన్ని ఇష్టపడతారు.
3. కోర్మా: పెర్షియన్, భారతీయ వంటకాలలో ఎక్కువగా కనిపించే మరో వంటకం కోర్మా. దీనిని కూరగాయలు, పనీర్ లేదా మాంసంతో తయారు చేస్తారు. కోర్మా వంటకం మూలాలు అక్బర్ కాలం నుంచే ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఈ వంటకానికి ఎంత ప్రాముఖ్యత ఉందో చెప్పుకోవచ్చు. కోర్మా వంటకం ప్రధానంగా నార్త్ ఇండియన్, మొఘలాయ్, షాహి ప్రాంతాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒక్కో చోట ఒక్కో మాదిరిగా తయారు చేస్తారు. ఈ రుచికరమైన గ్రేవీని చపాతీలు, నాన్ లేదా పరోటాలు, భోజనంలో స్వీకరిస్తారు.
4. విందాలూ: “విందలూ” అనేది భారతదేశంలోని గోవా ప్రాంతంలో ఉద్భవించిన అత్యంత మసాలా కూర వంటకం. ఇది స్పైసీ రుచులకు ప్రసిద్ధి చెందింది. తరచుగా మాంసంతో తయారు చేయబడుతుంది. సాధారణంగా పంది, గొడ్డు, మేక లేదా చికెన్ మాసంతో తయారు చేస్తారు. శాఖాహారం కోసం బంగాళాదుంపతో కూడా తయారు చేసుకోవచ్చు. 1800లలో బ్రిటన్ దేశీయాలు ఎక్కువగా ఈ వంటకం పట్ల ఆకర్షితులయ్యారు. తద్వారా ‘విందలూ’ వంటకం బ్రిటీష్ ఇండియన్ వంట పుస్తకాలలో కనిపిస్తుంది. ఈ స్పైస్-ఫార్వర్డ్ డిష్‌ను ఉడికించిన అన్నం లేదా పలు రకాలుగా స్వీకరిస్తారు.
5. హైదరాబాదీ బిర్యానీ: మీరు భారతీయులైతే బిర్యానీ కంటే ఐకానిక్ ఫుడ్ ఏదీ లేదని అంటే మీరు తప్పకుండా అంగీకరిస్తారు. టేస్ట్అట్లాస్ జాబితా ప్రకారం హైదరాబాదీ బిర్యానీ ఈ జాబితాలో టాప్ 5లో నిలిచింది. హైదరాబాద్‌లో ఈ వంటకం చెకెన్ లేదా మటన్ తో సుగంధ ద్రవ్యాలతో కూడిన బాస్మతి బియ్యంతో దీనిని పలు రకాలుగా తయారు చేస్తారు. విభిన్న రకాల బిర్యానీ ఫ్లెవర్లతో అనేక హైదరాబాద్ బిర్యానీ వంటకాలు ఎక్కువగా ప్రసిద్ధి చెందాయి. ఈ వంటకం తప్పకుండా తినాలని అనేక మంది హైదరాబాద్ వచ్చి అరగిస్తారు.