ఫ్రైడ్ రైస్, ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల చాలా మంది అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. నిల్వ చేసిన ఆహారాన్ని పదే పదే వేడి చేసి తీసుకోవడం వల్ల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. అందుకు కారణమైన బ్యాక్టీరియా గురించి కచ్చితంగా కొన్ని విషయాలను అందరూ తెలుసుకోవాలి.
జాక్‌ఫ్రూట్ మంచి ఆరోగ్యకరమైన కూరగాయ అయినప్పటికీ ఇందులో ఉండే ఆక్సలేట్‌తో పాటు కొన్ని ప్రత్యేక పదార్థాలు శరీరంలో విషపూరితమైనవి. ఇలాంటి క్రమంలో జాక్‌ఫ్రూట్ తిన్న తర్వాత తినకూడనివి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పండుగ సీజన్‌లో పాలు, పెరుగు, జున్ను విక్రయాలు గణనీయంగా పెరుగుతాయి. ఎందుకంటే ప్రజలు వివిధ రకాల వంటలను తయారు చేస్తారు. బాగా, ముఖ్యంగా జున్ను శాఖాహారుల మొదటి ఎంపిక.
యాపిల్ గింజలను నిర్లక్ష్యంగా తింటున్నారా.. యాపిల్ గింజల్లో విషం ఉందని ఎక్కడైనా విన్నారా? ఆపిల్ విత్తనాలు నిజానికి విషపూరితమైనవి. కానీ అవి పొడిగా చేసి ఉండి..ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు మనిషిని చంపేస్తాయి.
అల్పాహారం తీసుకోవడం వల్ల మన శరీరం శక్తితో నిండి ఉంటుంది. అల్పాహారాన్ని ఎప్పుడూ మిస్ చేయకూడదని కూడా ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మీ అనారోగ్యానికి ప్రధాన కారణం మీ ఆహారం. సరైన ఆహారం తీసుకోకపోతే ఆరోగ్యం పాడవుతుంది. అలాగే మీరు ఆకుకూరలు, పండ్లు తిన్నా అనారోగ్యంతో బాధపడుతున్నారంటే ఆహారం తీసుకునే సమయం సరిగ్గా లేదని అర్థం. కూరగాయలు, పండ్లు తినాలని మనకు తెలుసు. కానీ ఎప్పుడు తినాలో తెలియదు.
కందిపప్పులో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్, సోడియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో పాటు బీపీని కూడా నియంత్రిస్తుంది. డయాబెటిక్ పేషెంట్లకు కందిపప్పు చాలా మేలు చేస్తుంది.
సరైన జీవన శైలి ఫాలో కాకపోవడం, జంక్ ఫుడ్స్ తినడం, వ్యాయామం లేకపోవడం లాంటి కారణాల వల్ల చాలా మంది ఈ రోజుల్లో ఈజీగా బరువు పెరుగుతున్నారు. ఒత్తిడితో కూడిన జీవనశైలి, చెడు ఆహారం, సరైన నిద్ర లేకపోవడం, వ్యాయామం లేకపోవడం బరువు పెరగడానికి దారితీస్తుంది.
చోలే భటోరా(Chole Bhature) బ్రేక్ ఫాస్ట్ అనేక మందికి ఇష్టమైన ఆహారాలలో ఇది కూడా ఒకటి. అయితే ఇటివల ఓ వ్యక్తి దీనిని అధిక సాల్టెడ్, నో ప్రోటీన్ ఫుడ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు. అది చూసిన ఈ ఫుడ్ లవర్స్ తమదైన శైలిలో కామెంట్లు చేశారు. అయితే దీనిపై మీ అభిప్రాయం కూడా తెలపండి మరి.
ప్రపంచంలో బెస్ట్ టాప్ 5 సాంప్రదాయ ఆహార వంటకాలను ఇప్పుడు చుద్దాం. ఆన్‌లైన్ ఫుడ్ గైడ్ TasteAtlas నిర్వహించిన సర్వే మేరకు పలు రకాల ఆహారాల జాతిబాను ఇక్కడ మనం చూడవచ్చు.
కొన్నిసార్లు రెండు మంచి ఆహారాలు కలిపి తింటే శరీరానికి హాని కలుగుతుందని అంటారు. ఇది నిజం. వాటిలో ఒకటి గుడ్డు. ఈ రోజు మనం గుడ్లతో తినకూడని ఆహారాల గురించి మాట్లాడుకుందాం. అలాగే ఏ ఆహారంతో ఏం జరుగుతుందో చూద్దాం.
ప్రస్తుతం వర్షాకాలం సీజన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో డెంగ్యూ రాకుండా ఉండేందుకు రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. ఈ క్రమంలో ఇన్‌ఫెక్షన్‌లను అరికట్టడానికి ఆహార నియమావళిలో కొన్ని మార్పులు చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బందులు రావని నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
ఊబకాయం, స్థూలకాయం, లావు, బరువు పెరగడం ఈ రోజుల్లో ఎక్కువగా వింటున్న మాటలు. బరువు తగ్గడానికి రకరకాల కసరత్తులు చేసి సులువైన మార్గాన్ని అనుసరించి మరణించిన వారు మనలో ఉన్నారు. కొంతమంది ఆరోగ్యకరమైన వ్యాయామాలు, యోగా చేసినప్పటికీ బరువు తగ్గలేరు. అయితే సద్గురుగా పిలువబడే జగ్గీ వాసుదేవ్(sadhguru jaggi vasudev) బరువు తగ్గేందుకు కొన్ని చిట్కాలు చెప్పారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
ఎవరైనా మనకు హైదరాబాద్ అని పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది చార్ మినార్, తర్వాత బిర్యానీ. అయితే ఇప్పటికే భాగ్యనగరంలో బకెట్, కుండ, వెదురు సహా పలు రకాల బిర్యానీలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కొత్తగా బ్రిక్(ఇటుక) మోడల్ బిర్యానీ అందుబాటులోకి వచ్చింది. దీనిని ఇటుక మోడల్లో ఉన్న పాత్రలో నెయ్యి సహా పలు రకాల పదార్థాలను వేసి ఆర్గానిక్ పద్ధతిలో దీనిని తయారు చేస్తున్నారు. ఇది షాప్ నెం.2, పాత అల్వాల్ రో...
పసుపు(turmeric) అనేది దేశీ వంటకాలలో ఉపయోగించే ఒక సాధారణ మసాలా. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఆహారానికి పసుపు రంగును ఇవ్వడానికి కూడా పనిచేస్తుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఇది ఎక్కువగా తీసుకుంటే ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. ఎందుకో ఇప్పుడు చుద్దాం.