Health Tips: రాత్రిపూట ఈ ఫుడ్స్ తినకపోవడమే మంచిది..లేదంటే..!
మీ అనారోగ్యానికి ప్రధాన కారణం మీ ఆహారం. సరైన ఆహారం తీసుకోకపోతే ఆరోగ్యం పాడవుతుంది. అలాగే మీరు ఆకుకూరలు, పండ్లు తిన్నా అనారోగ్యంతో బాధపడుతున్నారంటే ఆహారం తీసుకునే సమయం సరిగ్గా లేదని అర్థం. కూరగాయలు, పండ్లు తినాలని మనకు తెలుసు. కానీ ఎప్పుడు తినాలో తెలియదు.
మనం రాత్రిపూట నిద్రపోవడానికి ముందు కూడా కొన్ని ఆహారాలు తింటాము . కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదు. దాని వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి. రాత్రి పడుకునే ముందు ఏ ఆహారం తీసుకోకూడదో అందరూ తెలుసుకోవాలి. ప్రస్తుతం కడుపు సంబంధత సమస్యలతో బాధపడే వారి సంఖ్య పెరిగింది. సగానికి పైగా ప్రజలు గ్యాస్ట్రిక్, ఉబ్బరం, అజీర్తి సమస్యతో బాధపడుతున్నారు. మీరు వారిలో ఒకరైతే రాత్రిపూట ఈ ఆహారాన్ని తినడం మానుకోండి.
హెవీ ఫుడ్: డిన్నర్ ఎల్లప్పుడూ తేలికగా ఉండాలి. కొంత మంది బాగా నిద్రపోవాలని కోరుకుంటూ భారీ ఆహారాన్ని తీసుకుంటారు. కానీ ఈ ఆహారం జీర్ణం కావడం కష్టం. రాత్రిపూట కొవ్వు , నూనె పదార్థాలు తినడం వల్ల అజీర్తి సమస్య వస్తుంది. మీ నిద్రకు భంగం కలిగిస్తుంది. మీరు రాత్రిపూట చీజ్ బర్గర్లు, వేయించిన వస్తువులు, మాంసం తినకూడదు.
కెఫిన్: టీ, కాఫీ, సోడా వంటి వాటిలో కెఫీన్ పెద్ద మొత్తంలో లభిస్తుంది. ఇవే కాకుండా మీరు తినే కొన్ని ఐస్ క్రీమ్‌లు, స్వీట్లలో కూడా కెఫీన్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. నిద్ర కూడా సరిగా పట్టదు.
తీపి ఆహారం (స్వీట్ ఫుడ్): రాత్రిపూట తియ్యని ఆహారం తినకూడదు. మీరు పడుకునే ముందు చక్కెర పదార్థాలను తీసుకుంటే, మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీని వల్ల మీరు గ్యాస్ , అసిడిటీకి గురవుతారు. తీపి పదార్థాలు మీ నిద్రను పాడు చేస్తాయి.
ఈ ఆహారాలకు దూరంగా ఉండండి: రాత్రిపూట మీరు టైరమైన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోకపోవడమే మంచిది. ఇది టొమాటో, సోయా సాస్, వంకాయ, రెడ్ వైన్లలో లభిస్తుంది. ఇది మీ నిద్రకు భంగం కలిగిస్తుంది. పుల్లటి త్రేన్పు వచ్చే అవకాశం ఉంది.
స్పైసీ ఫుడ్: రాత్రిపూట స్పైసీ ఫుడ్ తీసుకోవడం మంచిది కాదు. ఇది మీ కడుపులో యాసిడ్ ఉత్పత్తికి కారణమవుతుంది. ఇది నిద్రపై కూడా ప్రభావం చూపుతుంది. ఉదయం పూట స్పైసీ ఫుడ్ తీసుకుంటే మంచిది.
నీరు అధికంగా ఉండే ఆహారం: మన శరీరానికి నీరు అవసరం. కాబట్టి రాత్రి పడుకునే ముందు నీరు లేదా నీటి శాతం ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం మంచిది కాదు. ఇది తరచుగా మూత్రవిసర్జనకు కారణమవుతుంది. ఇది మీ నిద్రను పాడు చేస్తుంది.
ఆమ్ల ఆహారాన్ని తినవద్దు: కొన్ని కూరగాయలు, పండ్లలో ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. మీరు రాత్రిపూట అలాంటి ఆహారాన్ని తినకూడదు. సిట్రస్ రసాలు, పచ్చి ఉల్లిపాయలు, వైట్ వైన్, టొమాటో సాస్‌లను నివారించండి. ఇది మీ కడుపులో అధిక మొత్తంలో యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. నొప్పిని కలిగిస్తుంది. నిద్రలేమికి కారణమవుతుంది.