Health Tips: ఈ డ్రింక్ ఒక్కటి చాలు.. ఈజీగా బరువు తగ్గుతారు..!
సరైన జీవన శైలి ఫాలో కాకపోవడం, జంక్ ఫుడ్స్ తినడం, వ్యాయామం లేకపోవడం లాంటి కారణాల వల్ల చాలా మంది ఈ రోజుల్లో ఈజీగా బరువు పెరుగుతున్నారు. ఒత్తిడితో కూడిన జీవనశైలి, చెడు ఆహారం, సరైన నిద్ర లేకపోవడం, వ్యాయామం లేకపోవడం బరువు పెరగడానికి దారితీస్తుంది.
బరువు తగ్గేందుకు ప్రతి ఒక్కరూ రకరకాల సర్కస్‌లు చేస్తుంటారు. డైట్, వాకింగ్, రన్నింగ్ లాంటివి ట్రై చేస్తుంటారు. అయినా బరువు తగ్గలేరు. మీరు కూడా బరువు పెరుగుతున్న సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ ట్రిక్ని ఫాలో అయితే సరిపోతుంది. బరువు తగ్గడానికి ఉదయాన్నే వేడి నీళ్లలో తేనె, నిమ్మకాయ కలిపి తాగేవాళ్లు ఉన్నారు. అయితే బరువు తగ్గడానికి జీలకర్ర నీరు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని మీకు తెలుసా? అవును. జీలకర్ర నీటిలో బరువును నియంత్రించడం నుండి జీర్ణక్రియను మెరుగుపరచడం వరకు అనేక ఔషధ గుణాలు ఉన్నాయి.
ఉదయం కాకుండా రాత్రిపూట జీలకర్ర నీటిని తాగడం వల్ల చాలా మేలు జరుగుతుంది. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల అనేక రోగాలు తగ్గుతాయి. అందుకే ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగాలని డైట్ నిపుణులు సూచిస్తున్నారు. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. జీలకర్ర నీరు శరీరం నుండి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. త్వరగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. జీలకర్ర జీవక్రియ రేటును పెంచడానికి కూడా పనిచేస్తుంది. ఇది సులభంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అంతే కాదు మలబద్ధకం సమస్యను అధిగమించేందుకు ఈ నీరు ఎంతో మేలు చేస్తుంది.
జీలకర్రలో పెద్ద మొత్తంలో జీర్ణ ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు పని చేస్తాయి. భోజనం చేసిన 2 గంటల తర్వాత జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. ఇది ప్రధానంగా శరీరంలోని ఆహారాన్ని జీర్ణం చేయడానికి, వ్యర్థాలను తొలగించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇతర ఆహార పదార్థాల కంటే జీలకర్రలో దాదాపు 13 రెట్లు ఎక్కువ ఐరన్ ఉంటుంది. అందువల్ల జీలకర్ర నీటిని తాగడం అలవాటు చేసుకుంటే శరీరంలో ఐరన్ లోపాన్ని నయం చేస్తుంది. రాత్రి భోజనానికి అరగంట ముందు జీలకర్ర నీటిని తాగడం వల్ల ఐరన్ వంటి అనేక పోషకాలు శరీరానికి అందుతాయి. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది.