అన్ స్టాపబుల్ టాక్ షో మొదలు పెట్టినప్పుడు.. ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో అవుతుందని ఎవరు ఊహించలేదు.. అసలు అల్లు అరవింద్ కూడా ఊహించలేదు. అంతకుమించి పాపులారిటినీ సొంతం చేసుకుంది అన్‌స్టాపబుల్ టాక్ షో. రోజు రోజుకి దీనికి ఆదరణ పెరుగుతునే ఉంది. దీనంతటికి కారణం నందమూరి బాలకృష్ణ అనే చెప్పొచ్చు. ఎన్నడూ లేని విధంగా బాలయ్యతో బడా స్టార్స్ సందడి చేస్తుండడంతో.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే ఈ షోకు ప్రభాస్ రావడం ఓ అద్భుతంగా ఫీలవుతున్న సినీ లవర్స్.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాకతో మరింత క్రేజ్ ఏర్పడింది. అన్నపూర్ణ స్టూడియోలో పవన్ ఎపిసోడ్ షూటింగ్ కోసం.. ఏదో ప్యాన్ ఇండియా మూవీ ఓపెనింగ్ రేంజ్లో అభిమానులు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు.. జై బాలయ్య, జై పవన్ అనే నినాదంతో షూటింగ్ స్పాట్లో పండగ వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ ఎగ్జైటింగ్ స్పీచ్ హైలెట్‌గా నిలిచింది. ప్రభాస్‌తోనే పీక్స్‌కు వెళ్లిపోయిన అన్‌స్టాపబుల్.. ఇప్పుడు పవన్ రాకతో నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయింది. అసలు పవన్‌ను బాలయ్య ఎలాంటి ప్రశ్నలుఅడుగుతాడు.. అనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక షోకి పవన్‌తో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, క్రిష్ జాగర్లమూడి కూడా జాయిన్ అవుతున్నారని తెలుస్తోంది. అలాగే ఈ షో మధ్యలో మరో గెస్ట్ జాయిన్ అవబోతున్నట్టు తెలుస్తోంది. బాలయ్యతో ఫోన్ కాల్ ద్వారా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా కొద్ది సేపు జాయిన్ అవుతారట. దీంతో ఈ ఎపిసోడ్ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఏదేమైనా.. సినీ వర్గాల్లోనే కాదు రాజకీయంగాను పవన్, బాలయ్య టాక్ షో సెన్సేషన్ క్రియేట్ చేసేలానే ఉంది.