Surender Reddy: ఆ పాత బాకీ వల్లే సురేందర్ రెడ్డికి భారీ ఆఫర్!
అక్కినేని అఖిల్ ఎన్నో భారీ ఆశలు పెట్టుకొని నటించిన సినిమా ఏజెంట్. స్టైలిష్ మేకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి(Surender Reddy) డైరెక్టర్ అవడంతో.. అఖిల్‌కు భారీ మాసివ్ హిట్ పడుతుందని అనుకున్నారు అక్కినేని అభిమానులు. కానీ అఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చాడు సూరి. దీంతో ఈయనకు ఆఫర్లు రావడం కష్టమే అనుకున్నారు. కానీ ఆయన చేసిన పాత బాకీ వల్లే.. ఇప్పుడో బంపర్ ఆఫర్ అందుకున్నాడు.
ఏజెంట్ డిజాస్టర్ దెబ్బకు నిర్మాత అనిల్ సుంకరకు భారీ నష్టాలు వచ్చాయి. కనీసం బౌండెడ్ స్క్రిప్టు లేకుండానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడం.. ఏజెంట్ ఫ్లాప్‌ను ఆదిలోనే డిసైడ్ చేసేసింది. అయినా ఈ సినిమాకు రూ.80 కోట్ల వరకు బడ్జెట్ ఖర్చు చేశారు. కానీ ఈ సినిమా రూ.30 కోట్ల వరకు నష్టాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమా దెబ్బకు నిర్మాతతో పాటు హీరో అఖిల్, హీరోయిన్ సాక్షి వైద్య కెరీర్‌కు దారుణమైన డ్యామేజ్ జరిగింది. ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి(Surender Reddy), ఏజెంట్ ఫ్లాప్ తర్వాత మళ్ళీ బయట ఎక్కడా కనిపించలేదు. అనిల్ సుంకర, అఖిల్ ఈ సినిమా రిజల్ట్ పై స్పందించినా.. సురేందర్ రెడ్డి మాత్రం సైలెంట్‌గా ఉండిపోయాడు.
దాంతో ఏజెంట్ దెబ్బకు సూరి మరో ఆఫర్ రావడానికి చాలా సమయం పడుతుందని అనుకున్నారు. కానీ గీతా ఆర్ట్స్‌లో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు సూరి. ఇదే విషయాన్ని రీసెంట్గా 2018 సక్సెస్ మీట్లో చెప్పుకొచ్చాడు అల్లు అరవింద్. గతంలో అల్లు అరవింద్(allu arvind)కి సురేందర్ రెడ్డి ఇచ్చిన కమిట్ మెంట్ వల్ల ఈ కొత్త ప్రాజెక్ట్ సెట్ అయింది. గీతా ఆర్ట్స్ నిర్మించిన రామ్ చరణ్ ‘ధృవ’ సినిమా సమయంలోనే సూరితో మరో ప్రాజెక్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు అల్లు అరవింద్. కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చేశాడు.
కానీ ఆ తర్వాత ఇతర కమిట్మెంట్స్ కారణంగా ఈ కాంబో వర్కౌట్ కాలేదు. కానీ ఇప్పుడు అల్లు అరవింద్ కమిట్మెంట్ సురేందర్ రెడ్డికి కలిసొచ్చింది. ప్రస్తుతం సూరి స్క్రిప్టు రాసే పనిలో బిజీగా ఉన్నాడు. ఒకవేళ సూరి అదిరిపోయే కథతో అల్లు అరవింద్‌ని మెప్పిస్తే.. అల్లు అర్జున్(allu arjun)తోనే ఈ ప్రాజెక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. గతంలో బన్నీకి రేసుగుర్రం సినిమాతో సాలిడ్ హిట్ ఇచ్చాడు సూరి. మరి అల్లు అరవింద్ నమ్మకాన్ని నిలబెట్టేలా సూరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుందేమో చూడాలి.