Samantha: మకాం మార్చిన సమంత.. ట్రిపుల్ బెడ్ రూమ్‌కే అన్ని కోట్లా..!?
Samantha Ruth Prabhu buys a luxurious three-bedroom apartment in Mumbai for Rs 15 crores. ముంబైలో సీ ఫేసింగ్ ఉన్న ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనుక్కున్న సమంత. దాని ఖరీదు దాదాపు 15 కోట్ల వరకు ఉంటుందని బీ టౌన్లో ప్రచారం జరుగుతోంది.
Samantha Ruth Prabhu buys a luxurious three-bedroom apartment in Mumbai for Rs 15 crores. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత.. సినిమాల పరంగా మరింత స్పీడ్ పెంచింది సమంత. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో పలు భారీ ప్రాజెక్ట్స్ సైన్ చేసింది. అయితే ఊహించని విధంగా మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడడంతో.. కొన్నాళ్లు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. నిన్న మొన్నటి వరకు షూటింగ్‌లకు దూరంగా వుంటూ వచ్చింది. అయితే ఇప్పుడు సామ్ పూర్తిగా కోలుకుంది. ఇంకేముంది అమ్మడు మళ్లీ రంగంలోకిది దిగిపోయింది. వెంటనే ముంబాయిలో వాలిపోయింది. సిటాడెల్ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్‌తో కలిసి నటిస్తోంది. ఇదే కాదు.. ఇకపై సామ్ బాలీవుడ్ పైనే ఎక్కువగా ఫోకస్ చేయాలనుకుంటోందట. దాంతో ముంబైలోనే ఉండాలని భావిస్తోందట. అయితే ఆల్రెడీ సమంతకు హైదరాబాదులో ఒక ఫ్లాట్ ఉంది. సొంత సిటీ చెన్నైలో ఒక ఇల్లు ఉంది. ఇప్పుడు కోట్ల రూపాయలు పెట్టి ముంబైలో ఖరీదైనా ఫ్లాట్ కొనుగోలు చేసిందట. షూటింగ్ ఉంటేనే హైదారాబాద్, చెన్నైకి రావాలని అనుకుంటోందట. అందుకే ముంబైలో సీ ఫేసింగ్ ఉన్న ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనుక్కుందట. దాని ఖరీదు దాదాపు 15 కోట్ల వరకు ఉంటుందని బీ టౌన్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అమ్మడు అక్కడే ఉంటోందట. అక్కడి నుండే బాలీవుడ్ సినిమాల వ్యవహారం చూసుకోబోతోందట. ఇప్పటికే మేనేజర్ని మార్చేసిందని వార్తలొచ్చాయి. కాబట్టి ఇక పై సామ్ మకాం మారినట్టే. ఇకపోతే ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషీ’ మూవీలో నటిస్తోంది సమంత. శాకుంతలం రిలీజ్‌కు రెడీగా ఉంది. ఫిబ్రవరి 17 నుంచి పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా కొత్త తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. ఏదేమైనా.. ఇక సమంతను తెలుగు సినిమాల్లో చూడడం కష్టమేనేమో!