పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్‌ను నమ్మి వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు మూవీ మేకర్స్. ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ ప్రాజెక్ట్ కె, మారుతి ప్రాజెక్ట్ చేస్తున్నాడు డార్లింగ్. ఈ సినిమాలన్నీ సెట్స్ పై ఉన్నాయి. ఇక సందీపర్ రెడ్డి వంగ ‘స్పిరిట్’, సిద్ధార్థ్ ఆనంద్ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ ఇయర్లో స్టార్ట్ కాబోతున్నాయి. అయితే ఉన్నట్టుండి ప్రభాస్ సినిమా షూటింగులన్నీ క్యాన్సిల్ చేశాడనే న్యూస్ వైరల్‌గా మారింది. ప్రస్తుతం ప్రభాస్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని తెలుస్తోంది. డార్లింగ్ జ్వరంతో బాధపడుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. మారుతి సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెలలో ప్రారంభం కావాల్సి ఉందట. కానీ ప్రభాస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల షూటింగ్ ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇదే కాదు మిగతా షూటింగులను కూడా క్యాన్సిల్ చేసినట్లు సమాచారం. అయితే సోషల్ మీడియాలో ప్రభాస్‌కు అనారోగ్యం.. అని జరుగుతున్న ప్రచారం చూసి.. కాస్త టెన్షన్ పడుతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ప్రభాస్‌కు ఏమైందని ఆరా తీస్తున్నారు. కానీ ప్రభాస్ జస్ట్ ఫీవర్‌తో మాత్రమే సఫర్ అవుతున్నాడని తెలుస్తోంది. అయితే ఎంత పెద్ద స్టార్ అయినా.. అప్పుడప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేజ్ చేయాల్సిందే. పైగా డార్లింగ్ ఏ మాత్రం రెస్ట్ లేకుండా.. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటివి కామన్. అయినా ప్రభాస్ ఓ సారి దీనిపై క్లారిటీ ఇస్తే బాగుంటుందని అంటున్నారు అభిమానులు.. అలాగే డార్లింగ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇకపోతే ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో.. ఆదిపురుష్ ముందుగా రిలీజ్ కానుంది. జూన్‌లో ఆదిపురుష్, సెప్టెంబర్‌లో సలార్ రానుంది. ఆ తర్వాత మారుతి సినిమా వస్తుందని అంటున్నారు. ఆపైన ప్రాజెక్ట్ కె రానుంది. ఏదేమైనా ప్రభాస్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.