పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ పై వివాదాలు వస్తునే ఉన్నాయి. ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రామాయణం ఆధారంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్ రావణ్‌గా, కృతి సనన్ సీతగా నటిస్తోంది. అయితే ఏ ముహుర్తాన ఈ సినిమాను అనౌన్స్ చేశారో తెలియదు కానీ.. అప్పటినుంచి ఎదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంది. టీజర్ చూసిన తర్వాత ఆదిపురుష్ పై అనుమానాలు పెరిగిపోయాయి. రామయాణాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండి పడుతునే ఉన్నారు. హనుమంతుడు, రావణ లుక్, ప్రభాస్ వేషధారణ, విజువల్ ఎఫెక్ట్స్ ఇలా ఎదో ఒక విషయంలో ఆదిపురుష్ సినిమా పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా ఈ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. సెన్సార్ బోర్డ్ నుండి సర్టిఫికేట్ పొందకుండానే చిత్ర నిర్మాతలు ఆదిపురుష్ సినిమా ప్రోమోను విడుదల చేశారని, ఇది నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని పిటిషన్లో కుల్దీప్ తివారీ అనే వ్యక్తి పేర్కొన్నారు. సినిమాలో సీతా దేవి పాత్రను పోషిస్తున్న కృతి సనన్ దుస్తులపైనా కూడా పిటిషన్లో అభ్యంతరం వ్యక్తం చేశారు. పిల్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. సెన్సార్ బోర్డుకు నోటీసులు పంపింది. అలహాబాద్ హైకోర్టు ప్రభాస్ సినిమాపై దాఖలైన పిటిషన్ కి సమాధానం ఇవ్వమని సెన్సార్ బోర్డుని కోరింది. దాంతో మరోసారి ఆదిపురుష్ వార్తల్లోకి ఎక్కాడు. వాస్తవానికైతే.. అన్ని అనుకున్నట్టు జరిగి ఉంటే.. ఈపాటికి ఆదిపురుష్ థియేటర్లో ఉండేది. కానీ టీజర్ దెబ్బకు ఆదిపురుష్ సీన్ రివర్స్ అయిపోయింది. మరి లేటెస్ట్ వివాదంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.