టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ధూర్జటి విరచిత కవిత 'శ్రీకాళహస్తీశ్వర మహత్యం' ఆధారంగా మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర పార్ట్ 1.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ, దివంగత నటి శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
గతేడాది యానిమల్ సినిమాతో చరిత్ర సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తిరుపతిలో సందడి చేశారు. నేడు ఆయన కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె తాజాగా క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్ లో భారత్ తరపున పాల్గొనేందుకు జపాన్ లోని టోక్యో వెళ్లింది.
తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది..ప్రముఖ జానపద నేపథ్య గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్(73) అకస్మాత్తుగా కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా వయసురీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ కన్నుమూశారు. తన స్వరంతో కోట్లాది హృదయాలను శాసించిన గొంతుక ఇప్పుడు మూగబోయింది. పంకజ్ ఉదాస్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడ్డారు.
ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా ఉన్న టాప్ హీరోలాంతా వారి వారి రేంజ్‌ని బట్టి వంద కోట్ల నుంచి రెండొందల కోట్ల వరకు పారితోషికాన్ని వసూలు చేస్తున్నారు. అయితే ఓ హీరో మాత్రం సినిమాలో ఎనిమిది నిమిషాలు కనిపించడానికి రూ. 35 కోట్లు తీసుకున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఏంటా సినిమా? తెలుసుకుందాం పదండి.
కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని థియేటర్ అసోసియేషన్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఓటీటీ లాంటి ఫ్లాట్ ఫాంలకు రూల్స్ అండ్ కండిషన్స్ లేకపోతే సినిమా ఇండస్ట్రీకి చాలా నష్టం వాటిల్లుతుందని నిర్మాతలు భావిస్తున్నారు.
దీపికా పదుకొనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు, రణ్‌వీర్ కు పిల్లలంటే చాలా ఇష్టమని పేర్కొంది. తాము కూడా ఓ ఫ్యామిలీని మొదలు పెట్టే రోజు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు దీపికా పదుకోన్ చెప్పింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ రేంజ్ కు చేరుకున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమకే పెద్ద దిక్కుగా మారారు.